ఏపీలో టెంపుల్ రాజకీయాలు భగ్గుమంటున్నాయి. అధికార, ప్రతిపక్షాలు ఆరోపణ, ప్రత్యారోపణలతో రెచ్చిపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు విజయనగరం రాములువారి ఆలయాన్ని దర్శించడానికి సన్నగ్ధమవుతున్నారు. రేపు ఉదయం 10 గంటలకు విశాఖపట్నం చేరుకోనున్నట్లు తెలుస్తుంది. అక్కడి నుంచి బయలుదేవి ఉదయం 11:30 నిమిషాలకు రామతీర్థం చేరుకోవడానికి చంద్రబాబు ప్రణాళిక సిద్ధం చేశారు.
చంద్రబాబు, లోకేష్ కనుసన్నల్లోనే రామతీర్థం ఆలయ విగ్రహ ధ్వంసం జరిగిందని విజయసాయిరెడ్డి ఆరోపించిన నేపథ్యంలో చంద్రబాబు పర్యటన ప్రాధాన్యం సంతరించకుంది. టీడీపీ వారే చేసారనడానికి తమ వద్ద సాక్షాలున్నాయంటూ ఆరోపిస్తున్న విజయసాయి రెడ్డి.. తొందరలోనే దుండగులను వెలుగులోకి తీసుకువచ్చి శిక్ష వేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే.
Also Read: రామతీర్థం పేరుతో రచ్చ : వైసీపీ vs టీడీపీ











