టీడీపీ సానుభూతిపరులపై అక్రమ కేసులు పెడుతూ వేధిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దాడి చేసిన వారిపై కాకుండా బాధితులపైనే కేసులు పెట్టడాన్ని ఆయన ఆంక్షేపించారు. ఈ విషయాలపై ఆయన ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాశారు. బిక్కవోలు మండలం ఇల్లపల్లి పంచాయతీ సర్పంచ్‌గా గెలచిన వైసీపీ మద్దతుదారు టీడీపీ మద్దతుదారులను ఇబ్బందులు పెట్టడమే కాకుండా వారిపై తప్పుడు కేసులు పెట్టించారని లేఖలో పేర్కొన్నారు. పసిబిడ్డ భయపడుతోందని, ఇంటి ముందు టపాసులు కాల్చవద్దన్నందుకు వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్త రాఘవ, అతని కుటుంబసభ్యులపై దాడి చేయడమే కాకుండా వారిపై కేసులు పెట్టించారని తెలిపారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించేలా, ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా చర్యలు తీసుకోవాలని డీజీపీని చంద్రబాబు కోరారు.
Must Read ;- ఇంకెన్నాళ్లీ హత్యా రాజకీయాలు: చంద్రబాబు