ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఛత్రపతి’ సినిమా రీమేక్ తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ రంగ ప్రవేశం చేయనున్న సంగతి తలిసిందే. వి.వి. వినాయక్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. ఒక విధంగా వినాయక్ కు కూడా ఇది మంచి అవకాశంగానే భావించాలి. వినాయక్ జూనియర్ ఎన్టీఆర్ ను ‘ఆది’గా మార్చి తెలుగులో ఆయనకు ఓ స్టార్ డమ్ ను క్రియేట్ చేశారు. దీనికి హిందీలో కూడా ఛత్రపతి అనే పేరునే పెట్టారు.
ఇప్పుడు బెల్లంకొండను బాలీవుడ్ కు పరిచయం చేసి ఏం చేయబోతున్నారో చూడాలి. ప్రభాస్ సినిమాని దీనికి ఎంచుకోవడం కూడా సరైన నిర్ణయమే. పెన్ స్టూడియోస్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. డాక్టర్ జయంతి లాల్ గాడా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు హిందీలోకి అనువాదమై మంచి ఆదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా యూట్యూబ్ లో ఈ సినిమాలకు మంచి వ్యూస్ లభిస్తున్నాయి.
బాలీవుడ్ నేటివిటీకి తగ్గట్టుగా ఈ కథకు మార్పులు చేర్పులు చేశారు. దర్శకుడు వినాయక్ కు కూడా ఈ మధ్య కాలంలో సరైన హిట్లు లేవు. నటుడిగా ఎంట్రీ ఇద్దామనుకుంటే ఆ ప్రాజెక్టు కూడా ఆగిపోయింది. వినాయక్ ని దర్శకుడిగా పరిచయం చేసింది కూడా సాయి శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్. వినాయక్ కు ఇది ఓమంచి అవకాశం గానే భావించాలి. ఓ కమర్షియల్ హీరో, ఇంకో కమర్షియల్ డైరెక్టరు ఈ సినిమాను ఎలా మలుస్తారో చూడాలి.
Must Read ;- ప్రేమలో పడిన బాలీవుడ్ స్టార్ డాటర్.. !