టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘అల్లుడు శీను’ సినిమా ద్వారా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు శ్రీనివాస్. పెద్ద ప్రొడ్యూసర్ కొడుకుగా టాలివుడ్ లోకి అడుగుపెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్ అనతి కాలంలోనే మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. శ్రీనివాస్ కు ఒకటి, రెండు సినిమాలు తప్ప చెప్పుకోవడానికి పెద్ద హిట్ సినిమాలు ఏమీ లేవనే చెప్పాలి. కథల ఎంపికలో శ్రద్ధ చూపిస్తున్నా హిట్లు మాత్రం రావడం లేదు శ్రీనివాస్ కు.
ఇప్పుడు ఈ హీరో బాలీవుడ్ లోకి అడుగుపెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడని సమాచారం. దీనికి కారణం బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన సినిమాలు హిందీలో డబ్ అయ్యి యూట్యూబ్ లో మంచి వ్యూస్ సాధిస్తున్నాయి. తన సినిమాలకు బాలీవుడ్ లో మంచి ఆదరణ ఉందని గ్రహించిన శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. అయితే శ్రీనివాస్, ప్రభాస్ నటించిన ‘ఛత్రపతి’ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని భావిస్తున్నాడని సమాచారం. ఈ రీమేక్ సినిమా తనకు ఫర్ఫెక్ట్ ఎంట్రీ అని భావిస్తున్నాడట.
‘ఛత్రపతి’ సినిమాలో యాక్షన్, ఎమోషన్, అమ్మ సెంటిమెంట్ అన్నీ కలగలసి ఉంటాయి. ఇటువంటి సినిమాలు బాలీవుడ్ లో బాగా ఆదరిస్తారనే చెప్పాలి. అందుకనే ‘ఛత్రపతి’ సినిమాను బెల్లంకొండ శ్రీనివాస్ ఎంచుకున్నాడని టాక్ నడుస్తోంది. ఇప్పటికే సినిమా పనులు మొదలుపెట్టారని, త్వరలోనే ఈ సినిమాపై పూర్తి వివరాలను బెల్లంకొండ శ్రీనివాస్ మీడియాకు తెలుపుతారని సమాచారం.
తెలుగులో ప్రభాస్ సినీ జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా ‘ఛత్రపతి. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఛత్రపతి’ సినిమా టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ ను సృష్టించింది. అలాగే బాలీవుడ్ లో కూడా ఈ సినిమా విజయవంతమై హీరో శ్రీనివాస్ సినీ జీవితాన్ని మలుపు తిప్పాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఈ వార్తలో నిజమెంత ఉందొ తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
AlsoRead ;- రాజమౌళికి మరోసారి షాక్ ఇచ్చిన అలియా











