దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ క్రేజీ మల్టీస్టారర్ షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత రాజమౌళి ఛత్రపతి శివాజీ బయోపిక్ ను తెరకెక్కించబోతున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినపడుతున్నాయి. ఇప్పటికే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద కథను సిద్ధం చేసారని టాక్. ‘బాహుబలి’ సినిమా నిర్మించిన ఆర్క మీడియా వర్క్స్ బ్యానరే ఈ సినిమాను కూడా నిర్మిస్తారని తెలుస్తోంది.
Must Read:-దర్శకధీరుడు రాజమౌళికి బీజేపీ ఎంపీ వార్నింగ్
ఛత్రపతి శివాజీ బయోపిక్ ను కూడా అంతర్జాతీయ మార్కెట్ కు తగ్గట్లుగానే తెరకెక్కిస్తారని సమాచారం. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తాడని కూడా టాక్ నడుస్తోంది. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో మహేష్ ఒక చిత్రంలో నటించాలి. కాని రాజమౌళి, మహేష్ ఇద్దరూ తమ సినిమాలతో బిజీగా ఉండడం వలన ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా సెట్ అవ్వలేదు. ఎట్టకేలకు ఇప్పుడు వీరిద్దరూ ఛత్రపతి శివాజీ బయోపిక్ కోసం కలవబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Must Read:-ప్రిన్స్ మహేష్ బాబు దుబాయ్ ఎందుకెళ్లారో తెలుసా?
రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది మే నెలలో పూర్తి చేసుకుంటుంది. అలాగే మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట‘ సినిమా షూటింగ్ కూడా వచ్చే ఏడాది ఆగస్టులో ఫినిష్ అవుతుందని తెలుస్తోంది. ఆ తర్వాత మహేష్ – రాజమౌళి చిత్రం సెట్స్ పై వెళ్లనున్నదని సమాచారం. వీరిద్దరి కాంబినేషన్ కోసం ఎప్పటి నుండో మహేష్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ వార్త నిజమైతే కనుక వారికి ఇక పండుగనే చెప్పాలి. మరి ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.
Also Read:-‘సర్కారు వారి పాట’ పాడడానికి సూపర్ స్టార్ రెడీ..!