ఓటీటీలలో ప్రసారం అవుతున్న వెబ్ సిరీస్ ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాటిని ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. అందుకనే పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్లు వెబ్ సిరీస్ లలో నటించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికే అనేకమంది బడా స్టార్లు నటించారు కూడా. ఇప్పుడు ఆ జాబితాలోకి చేరబోతున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్. అతడు కూడా ఒక వెబ్ సిరీస్ లో నటించడానికి ఓకే చెప్పాడని బాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ హృతిక్ కు ఏకంగా 90కోట్లు ఆఫర్ చేసిందని సమాచారం. భారీ యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కే ఈ వెబ్ సిరీస్ కోసం హృతిక్ కూడా సిద్దమవుతున్నాడని తెలుస్తోంది.
Also Read:-గోదావరి ప్రేమికుడి చూపు.. వెబ్ సిరీస్ వైపు
హృతిక్ కు మన ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉండడంతో ఆయనకు అంత ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారని టాక్ నడుస్తోంది. పైగా ఈ వెబ్ సిరీస్ లో కేవలం ఆరు ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయట. ఇందులో హృతిక్ తో పాటు హీరోయిన్ దిశా పటానీ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించనున్నట్లు సమాచారం. డిసెంబర్ మొదటి వారంలో వెబ్ సిరీస్ షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. వెబ్ సిరీస్ కి సంబంధించిన విశేషాలను ఓటీటీ సంస్థ త్వరలోనే తెలియజేస్తుందని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. కేవలం ఆరు ఎపిసోడ్స్ కు ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ ఇస్తుంటే మిగిలిన హీరోలు కూడా వెబ్ సిరీస్ ల వైపు కచ్చితంగా చూస్తారు.
Also Read:-హృతిక్ కు విలన్ గా విజయ్ సేతుపతి