రామ్, జగదీష్, సంజయ్ ఆచార్య, దివేష్ హీరోలుగా, కిస్లే చౌదరి, రేఖ నిరోషా, మంజీర హీరోయిన్లుగా రూపొందిన ఈ చిత్రాన్ని సుజాత ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుజాత ఆళ్ళ నిర్మించారు. క్రిస్మస్ సందర్భంగా శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత, పంపిణీదారులు ముత్యాల రాందాస్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ముత్యాల రాందాస్ మాట్లాడుతూ, “రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని థియేటర్లు తెరచుకుంటున్నప్పటికీ ఇంకా కొన్ని థియేటర్లు ఓపెన్ కావాల్సివుంది. ఎగ్జిబిటర్లు తాము ఎదుర్కొంటున్న సమస్యల కారణంగానే ఆలస్యమవుతోంది. ప్రస్తుతానికి ప్రతీ జిల్లాలోను మాకు దొరికిన థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. కంటెంట్ ను నమ్ముకుని తీసిన ఈ చిత్రాన్ని తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం” అని అన్నారు.
దర్శకుడు జయప్రకాష్ మాట్లాడుతూ, నలుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిల మధ్య ఆసక్తికరంగా సాగే ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని మలిచామని చెప్పారు. నిర్మాత సుజాత ఆళ్ళ మాట్లాడుతూ,,“ముత్యాల రాందాస్ సంపూర్ణ సహకారంతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం ” అని అన్నారు. ఈ సమావేశంలో అతిథులుగా తెలుగు ఫిలిం ఛాంబర్ సెక్రటరీ, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ శక్తి రమేష్, నిర్మాత, ఎగ్జిబిటర్ శంకర్ గౌడ్, సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ నాగార్జున, చిత్ర మరో నిర్మాత రాంకుమార్, చిత్ర హీరోలు రామ్, జగదీష్, హీరోయిన్లు కిస్లే చౌదరి, మంజీర తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఈశ్వర్ హేమకాంత్, ప్రభంజన్, ఎడిటింగ్: వెంకటేశ్వరరావు పాశం
Must Read ;- మహేష్, నమ్రతలకు గిఫ్ట్ లు పంపిన పవన్ దంపతులు











