మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ఆచార్య. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ క్రేజీ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. తండ్రీ కొడుకులిద్దరూ కలిసి నటిస్తుండడంతో ఆచార్య పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. గతంలో చిరు, చరణ్ కలిసి నటించినా.. గెస్ట్ రోల్స్ మాత్రమే. ఇప్పుడు చిరు మూవీలో చరణ్ దాదాపు ఓ గంట సేపు కనిపించే పాత్ర పోషిస్తుండడంతో మెగా అభిమానులు ఆచార్య ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు.

ఇందులో చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది. ఆల్రెడీ చిరు, కాజల్ పై సన్నివేశాలను చిత్రీకరించడం జరిగింది. అయితే.. రామ్ చరణ్ కూడా హీరోయిన్ ఉంటుందని.. క్రేజీ హీరోయిన్ రష్మికను ఎంపిక చేయనున్నారని వార్తలు వచ్చాయి. రష్మిక కంటే ముందుగా బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీని కాంటాక్ట్ చేశారు. అయితే.. బాలీవుడ్ లో బిజీగా ఉండడం వలన ఆచార్యలో చరణ్ సరసన నటించేందుకు నో చెప్పినట్టు వార్తలు వచ్చాయి.
తాజా వార్త ఏంటంటే.. రష్మికను కాకుండా క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డేను ఎంపిక చేశారట. చరణ్, పూజా హేగ్డే కలిసి ఇప్పటి వరకు నటంచలేదు. ఫస్ట్ టైమ్ ఆచార్యలో నటించబోతున్నట్టు టాక్ . చిరు, చరణ్ కలిసి నటిస్తున్న సినిమా కావడం.. వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధిస్తున్న బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల ఈ చిత్రానికి దర్శకుడు కావడం.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే కూడా నటిస్తుండడంతో ఆచార్య పై మరింత ఆసక్తి ఏర్పడింది. ఈ భారీ చిత్రాన్ని మే 9న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Must Read ;- రష్మిక.. బాలీవుడ్ ఎంట్రీ ‘పుష్ప’ మూవీకి కలిసొస్తుందా.?











