ఈ తడవ ఎన్నికలను నాలుగు ప్యానల్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సి.కల్యాణ్ ప్యానల్ గట్టి పోటీనే ఇస్తుందని అందరూ భావించారు. కానీ విజయం మాత్రం వినోద్ బాల ప్యానల్ ను వరించింది. 11 మంది కమిటీ సభ్యుల కోసం జరిగిన ఈ ఎన్నకలలో వినోద్ బాల ప్యానల్ నుంచి 10 మంది విజేతలుగా నిలువగా, కొమర వెంకటేష్ ప్యానల్ నుంచి ఒకరు మాత్రమే గెలుపొందారు.
వినోద్ బాల ప్యానల్ నుంచి అనిల్ కుమార్ వల్లభనేని (1271 ఓట్లు), కాదంబరి కిరణ్ (1257 ఓట్లు), మహానందరెడ్డి (1038 ఓట్లు), దొర (929 ఓట్లు), ప్రవీణ్ (779 ఓట్లు), అళహరి (732 ఓట్లు), ప్రసాద్ (720 ఓట్లు), లలిత (1112 ఓట్లు), దీప్తి (1190 ఓట్లు), అనిత (887 ఓట్లు) విజయం సాధించగా, కొమర వెంకటేష్ ప్యానల్ నుంచి రఘు బత్తుల (707 ఓట్లు) విజేతగా నిలిచారు.
Must Read ;- పోటాపోటీగా చిత్రపురి కాలనీ ఎన్నికలు