జానీ మాస్టర్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనుకున్నారు. ఆయన కోసం కథ రెడీ చేశానని.. ఖచ్చితంగా ఆయనతో సినిమా తీస్తానని చాలా ఇంటర్ వ్యూలో చెప్పారు. రీసెంట్ పవన్ కళ్యాణ్ కి జానీ మాస్టర్ కథ చెప్పడం జరిగిందని.. ఈ కథ నచ్చడంతో పవన్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వచ్చింది. అంతే కాకుండా.. జానీ మాస్టర్ ని చరణ్ కి కూడా కథ చెప్పమన్నారని వార్తలు వచ్చాయి. దీంతో చరణ్ బ్యానర్ లో పవన్ కళ్యాణ్ తో జానీ మాస్టర్ సినిమా అని గట్టిగా ప్రచారం జరిగింది. ఇదిలా ఉంటే.. పవన్ తో బండ్ల గణేష్ గబ్బర్ సింగ్ మూవీని నిర్మించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో బండ్ల గణేష్ బ్యానర్ లో మరో సినిమా చేస్తానని పవన్ మాట ఇచ్చారట. ఇటీవల మా దేవుడు పవన్ కళ్యాణ్ కరుణించాడు సినిమా చేస్తున్నాని గణేష్ ప్రకటించారు. అయితే.. డైరెక్టర్ ఎవరు అనేది ప్రకటించలేదు. జానీ మాస్టర్ డైరెక్షన్ లో పవన్ నటించే సినిమాకి బండ్ల గణేష్ నిర్మాత అంటూ ప్రచారం జరిగింది. ఈ సినిమా గురించి ఎనౌన్స్ మెంట్ రానుంది.. జానీ మాస్టర్ డైరెక్టర్ కానున్నారని అనుకుంటుంటే.. సడన్ గా హీరోగా చేసేందుకు ముందుకొచ్చారు జానీ మాస్టర్.
అవును.. జానీ మాస్టర్ హీరోగా ఓ సినిమా ఈరోజు ప్రారంభం అయ్యింది. ఈ చిత్రాన్నికె. వెంకట్ రమణ నిర్మిస్తున్నారు. ఓ సినిమాని నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు మురళీ రాజ్ అనే దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇందులో జానీ మాస్టర్ సరసన దిగంగనా సూర్య వంశీ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటి వరకూ కొరియాగ్రాఫర్ గా సక్సస్ సాధించిన జానీ మాస్టర్ హీరోగా ఎంత వరకు రాణిస్తారో చూడాలి.











