మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్నెన్నో సరికొత్త పథకాలను, చట్టాలను రూపొందిస్తున్నారు. ఎన్ని రక్షణ వలయాలు ఏర్పాటుచేస్తున్న, మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యం కావడం లేదు. మహిళలు ప్రయాణ సమయంలో భద్రత కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త యాప్ ని సిద్ధం చేసింది. దాని పేరే ‘అభయం’. దానిని ఈరోజు ముఖ్యమంత్రి తాడేపల్లి గూడెం క్యాంపు ఆఫీస్ నుండి ప్రారంభించారు.
ప్రయాణ భద్రత
పరిస్థితులు ఒకప్పటిలా లేవు. ఇప్పటి కాలంలో మహిళలు సైతం ఒంటరిగా ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నారు. అటువంటి సమయంలో వారికి భద్రత కరువైన మాట నిజం. నేటి కాలంలో ప్రయాణానికి ఎక్కువగా ఆటోలాంటివి ఉపయోగిస్తున్నారు. వాటిలో ఒంటరిగా ఎక్కిన మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన సంఘటనలు చాలా ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం, మహిళలు ఒంటరిగా ప్రయాణిస్తున్న సమయంలో వారికి భద్రత కల్పించడానికి సరికొత్త యాప్ ని రూపొందించారు.
విశాఖలో ప్రారంభం
అందరికీ అందుబాటులోకి తేవడానికి ముందుగా ఈ యాప్ ని ప్రయోగాత్మకంగా నిర్వహించడానిక విశాఖ జిల్లాను ఎంచకుంది ప్రభుత్వం. మహిళలు, చిన్నారులకు భద్రత కల్పించడానికి ఈ యాప్ ని డిజైన్ చేసినట్లుగా ప్రభత్వం తెలిపింది. ప్రయాణ సమయంలో వాహానం ట్రాకింగ్ అయ్యేలా ప్రత్యేక పరికరాల్ని ఉపయోగిస్తారు. దీని ద్వారా వాహానం ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్తుందనేది పోలీసుల దగ్గర సమాచారం నమోదవుతుంది. దాదాపు లక్ష ఆటోలు ఈ యాప్ కిందకి వచ్చేలా ప్రభుత్వ ఏర్పాట్లు ప్రారంభించింది.
ఏం లాభం?
ఇలాంటి రక్షణ యాప్ లు కొత్తేమీ కాదు, ఇప్పటికే ఎన్నో ఉన్నాయి. ఇవే కాదు, దోషులను శిక్షించడానికి ఎన్నో కఠినమైన చట్టాలు కూడా ఉన్నాయి. కానీ ఎన్ని ఉన్నా సకాలంలో స్పందించినపుడే వాటి వల్ల ఉపయోగం ఉంటుంది. అలా జరగనపుడు ఎన్ని చట్టాలు, యాప్ లు తీసుకువచ్చినా అవి అలంకార ప్రాయమే కానీ, ఉపయోగం శూన్యం.
Must Read ;- 300 రోజులకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు











