శతమానంభవతి సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ వేగేశ్న సతీష్. ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లో సైతం మంచి కలెక్షన్స్ వచ్చాయి. అంతే కాకుండా ఈ సినిమా జాతీయ అవార్డ్ సైతం దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత వేగేశ్న సతీష్ నందమూరి కళ్యాణ్ రామ్ తో ఎంత మంచివాడవురా అనే సినిమా తీసారు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇప్పుడు వేగేశ్న సతీష్.. శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి, అలాగే ఆయన కుమారుడు సమీర్ వేగేశ్నను కథానాయకుడుగా పరిచయం చేస్తూ కోతికొమ్మచ్చి అనే సినిమా తీస్తున్నారు.

ఈ సినిమాని ఇటీవల స్టార్ట్ చేసారు. అమలాపురం, రాజమండ్రిలో షూటింగ్ చేసారు. ఆతర్వాత వైజాగ్ లో షూటింగ్ చేసారు. ఇప్పుడు ఈ సినిమా ఒక పాట మినహా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. త్వరలో బ్యాలెన్స్ ఉన్న సాంగ్ ను కంప్లీట్ చేసి రిలీజ్ ఎప్పుడు అనేది ప్రకటిస్తాం అంటున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. సంక్రాంతికి ఈ సినిమా థియేటర్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇందులో సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్, నరేష్ కీలక పాత్రలు పోషించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఇది చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది అంటున్నారు.
అవుట్ డోరో.. అదీ కూడా కరోనా టైమ్ లో ఇంత ఫాస్ట్ గా సినిమా తీసేసారంటే దానికి ప్రధాన కారణం ప్లానింగ్ అంతా పక్కాగా ఉండడమే. ప్రీ ప్రొడక్షన్ లోనే బాగా వర్క్ చేసారు. అందుకే అనుకున్నట్టుగా ఫాస్ట్ గా కంప్లీట్ చేసారు. ఎంత మంచివాడవురా సినిమా సక్సస్ సాధించకపోవడంతో ఈసారి ఖచ్చితంగా విజయం సాధించాలని ఈ సినిమా తీసారు. అయితే.. ఈసారి ఎమోషన్స్ ని కాకుండా.. ఎంటర్ టైన్మెంట్ నే నమ్ముకున్నారు. మరి.. ఎంటర్ టైన్మెంట్ వర్క్వుట్ అయితే.. కోతికొమ్మచ్చి థియేటర్ లో నవ్వులు పూయించడం ఖాయం.
Must Read ;- అందాల హనీ.. మెహ్రీన్ ఏమైపోయిందబ్బా?