‘చలో విజయవాడ’ నిర్వహించి తీరుతాం..
ఉద్యోగుల నిరసనలను, ఉద్యమాలను జగన్ రెడ్డి ప్రభుత్వం అడుగడుగునా అణదొక్కే ప్రయత్నం చేస్తునే ఉంది. కొత్త పీఆర్సీతో వేతనాలు తగ్గుతున్నాయని ఉద్యోగులు అవేదన వ్యక్తం చేస్తున్నా.. వారి విషయంలో మొండి ప్రభుత్వం దయచూపడంలేదన్న విమర్శలు లేకపోలేదు. జీతాలు పెరుగుతాయని మంత్రులు ఒకవైపు చెబుతుంటే.. జీతాలు పెరిగితే ఉద్యమం చేయాల్సిన అవసరం మాకేంటని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను, లోటు బడ్జెట్ ఉద్యోగులు గమనిస్తునే .. ఉద్యోగులు తమ సమస్యలను, డిమాండ్లను వాయిదా వేసుకుంటునే వస్తున్నారు. అలా జగన్ రెడ్డి మాటలను నమ్మి నిలువున మోసపోయామని ఉద్యోగులు చివరాఖరికి తెలుసుకున్నారు. ప్రభుత్వం పెద్దలు చెప్పినట్లు విని, మోసపోయింది చాలు అని తేరుకున్నారు. ఇక ఉపేక్షించేది లేదని, గడిచిన పదిరోజులుగా వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఈ నెల 3న ఉద్యోగుల ఐక్యతను చాటేందుకు ‘చలో విజయవాడ’ కు పిలుపునిచ్చారు ఉద్యోగులు. అయితే వివిధ కారణాలు చెప్పిన ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేయాలని కుట్రలు పన్నుతోంది జగన్ రెడ్డి ప్రభుత్వం! అయితే పోలీసులు ఎన్ని ఆంక్షాలు విధించిన ‘చలో విజయవాడ’ నిర్వహించి తీరుతామని ఉద్యోగులు ఖరాఖండి చెబుతున్నారు.
అనుమతులను నిరాకరించిన పోలీసులు!
విజయవాడ కేంద్రంగా నిర్వహించే ‘చలో విజయవాడ’ కు పోలీసులు అనుమతి నిరాకరించారు. కరోనా కారణంగా అనుమతి నిరాకరిస్తున్నట్లు సీపీ క్రాంతి రాణా తెలిపారు. ‘చలో విజయవాడ’ నిర్వహణ చట్టవిరుద్దమని సీపీ క్రాంతి రాణా చెప్పారు. ఉద్యోగులు కాండాక్ట్ రూల్స్ ప్రకారం కూడా చలో విజయవాడ కార్యక్రమం చేయకూడదని సీపీ పేర్కొన్నారు. ఉద్యోగులు భారీగా వస్తారని అంచనా ఉందని, అందుకే అనుమతులు నిరాఖరిస్తున్నామని ఆయన వెల్లడించారు. భారీ సముహాలు ఉన్నప్పడు బయట వ్యక్తులు చొరపడే ప్రమాదం ఉందని సీపీ స్పష్టం చేశారు. అయితే కావాలనే కుట్రపూరితంగా ‘చలో విజయవాడ’ ను ప్రభుత్వం అడ్డుకుంటుందని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. లక్షమంది ఉద్యోగులతో ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తే జగన్ రెడ్డి ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టడం ఖాయమని, అందుకే ఇలా ఆంక్షలు పేరుతో అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలానే జిల్లాల పునర్విభజన నేపధ్యంలో కొత్తగా ఏర్ఫడిన జిల్లా కేంద్రాల్లో స్థానిక ఎమ్మెల్యే నేతృత్వంతో వేలమందితో సంఘభావ యాత్రలు ఎలా నిర్వహిస్తున్నారు? వాటిని పోలీసులు ఎలా అనుమతించారా? అని విపక్షలు ప్రశ్నిస్తున్నాయి. విపక్షాలకు, ప్రభుత్వ చర్యలను ఎండగట్టే ఉద్యోగులకు ఒక రూల్, అధికారపార్టీకి ఒక రూలా? అని విపక్షలు మండిపడుతున్నాయి.
Must Read:-పాత జీతాలివ్వడం సాధ్యం కాదు..! కొత్త పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవడం కుదరదు!!











