Congress Munugodu MLA Komatireddy Rajagopal Reddy Shocking Comments :
ఇప్పట్లో సాధారణ ఎన్నికలు లేవు.. పంచాయతీ ఎన్నికలు అసలే లేవ్.. అయినా తెలంగాణలో రాజకీయ వేడి రోజురోజుకూ పెరుగుతోంది. హుజురాబాద్ ఉప ఎన్నికయే ఇందుకు కారణం. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలంగాణ కేబినెట్ వైదొలిగిన నాటి నుంచి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈటల టీఆర్ ఎస్ కు గుడ్ బై చెప్పడం, ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోవడం చకచకా జరిగిపోయాయి. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎక్కడా ఏ ఉప ఎన్నిక జరిగినా తెలంగాణ సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపిస్తారు. ఆచరణకు సాధ్యంకాని సంక్షేమ పథకాలు అమలుచేస్తారని సొంత పార్టీ నేతలు అభిప్రాయపడుతుంటారు. ఉప ఎన్నిక నేపథ్యంలో హుజురాబాద్ ను కైవలం చేసుకునేందుకు తమ అమ్ముల పొదిలో ఉన్న దళిత బంధును తెరపైకి తెచ్చారు. ఈటలను ఓడించడానికి వేల కోట్లు ఖర్చుచేస్తున్నారని ఇతర పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఉప ఎన్నిక వస్తేనే.. కేసీఆర్ కు సంక్షేమ పథకాలు గుర్తుకు వస్తుండటంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన ప్రకటన చేయడం చర్చనీయాంశమమవుతోంది.
బాంబు పేల్చిన రాజగోపాల్ రెడ్డి
ఉప ఎన్నికతో ప్రజలకు మేలు జరుగుతుందంటే తాను మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం ఆయన నల్లగొండ జిల్లాలో పర్యటించి మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నిక వస్తేనే కేసీఆర్ సంక్షేమ పథకాలు గుర్తుకువస్తున్నాయని, సీఎం కేసీఆర్ మునుగోడు నియోజకవర్గానికి రూ.2 వేల కోట్లు కేటాయించి, ప్రజల సమస్యలను పరిష్కరిస్తే తాను రాజీనామాకు సిద్ధమని తేల్చి చెప్పారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఉన్నందునే కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టారని, ఈ పథకం మోసపూరితమైందని రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేశారు.
Must Read ;- ఈటల క్వశ్చన్..! దళిత సీఎం ఎటుపోయింది?