తెలంగాణలో కొత్త కేసులు నమోదు అయితే, అందులో గ్రేటర్ హైదరాబాద్ లోనే అధిక శాతం కేసులు ఉంటాయి. లాక్ డౌన్ కు ముందు 3 వేల నుంచి 4 వేల కొత్త కేసులు నమోదు అవుతుండేవి. కరోనా వైరస్ తగ్గుతుండటంతో గ్రేటర్ హైదరాబాద్ లో చాలా తక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. పాజిటివ్, మరణాలు గణనీయంగా తగ్గుతున్నాయి. ఈనెల ఆరో తేదీ నుంచి 200 లోపే కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 1,771 కరోనా కేసులు నమోదు కాగా, గ్రేటర్ హైదరాబాద్ లో 171 కేసులు నమోదు అయినట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. వైరస్ వ్యాప్తి బాగా తగ్గుతుండటంతో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.
దేశంలో 80,834 కేసులు
లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 80,834 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. కొత్తగా 1,32,062 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
Must Read ;- తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు











