టాలీవుడ్ కింగ్ నాగార్జున, యువసమ్రాట్ నాగచైతన్య కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ మల్టీస్టారర్ బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ క్రేజీ మల్టీస్టారర్ రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. నాగ్ బర్త్ డే సందర్భంగా బంగార్రాజు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో బంగార్రాజు స్వర్గం నుంచి భూలోకానికి దిగి వస్తున్నట్టు కనిపించారు. ఈ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా కోసం స్వర్గం సెట్ ను ప్రత్యేకంగా రూపొందించారు. ఈ సెట్ లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది.
అయితే.. స్వర్గం అనగానే రంభ, ఊర్వశి, మేనక గుర్తొస్తారు. ఇప్పుడు ఈ సినిమాలో ఆ పాత్రలకు ఎవర్ని ఎంపిక చేశారు అనేది ఆసక్తిగా మారింది. అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ.. ముగ్గురు ముద్దుగుమ్మలను ఆల్రెడీ ఎంపిక చేశారని తెలిసింది. ఇంతకీ ఎవరా ముగ్గురు కథానాయికలు అంటే.. బిగ్ బాస్ 4తో బాగా పాపులర్ అయిన మోనాల్ గజ్జర్, దర్శన, అక్షత అని సమాచారం. రంభ, ఊర్వశి, మేనకలతో నాగార్జున, నాగచైతన్యల డాన్స్ కూడా ఉంటుందని అంటున్నారు. ఈ సాంగ్ ఓ రేంజ్ లో ఉంటుందట.
నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుంటే.. నాగచైతన్య సరసన కృతిశెట్టి నటిస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Must Read ;- లవ్ స్టోరీ కోసం మళ్లీ రీ షూట్స్ చేస్తున్నారా..?











