ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా.. వైఎస్సార్ కప్ పేరుతో.. భారీ స్థాయిలో క్రికెట్ టోర్నీ నిర్వహించబోతున్నారు. 22 గ్రౌండ్లలో 431 టీమ్ లు , 6 వేల క్రీడాకారులతో అతి భారీ స్థాయిలో ఈ టోర్నీ జరగబోతోంది. ఈ విషయాలని పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్వయంగా విశాఖల మీడియాకు వెల్లడించారు.
యువత ఆశయ సాధన కోసం చిత్తశుద్ధి పోరాడేతత్వాన్ని అలవాటు చేయడానికి ఈ క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. విశాఖ నుంచి భావి క్రికెటర్లు తయారు చెయ్యాలనేదే లక్ష్యంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కరోన వల్ల ఈ సంవత్సరం క్రికెట్ కే పరిమితం అయినప్పటికీ, రానున్న సంవత్సరాలలో మరిన్ని క్రీడలు నిర్వహిస్తామన్నారు.
ప్రగతి భారతి ఫౌండేషన్ విషయంలో ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయి.. ఒక్క పైసా ఎవ్వరివద్ద తీసుకోలేదని విజయసాయి చెప్పారు. చంద్రబాబు అన్ని నెగిటివ్ గా ఆలోచిస్తారని, పోలీసు అధికారి పడిపోతే వైసీపీ కార్యకర్త లేపారని.. దాన్ని దాడిగా ప్రచారం చేశారని అన్నారు. చంద్రబాబు ఆలోచన మారినంత వరకు ఆయన ఆయన పార్టీ మనుగడ కష్టం అని అభిప్రాయపడ్డారు.
స్థానిక సంస్థలు ఎన్నికలు ప్రభుత్వం అనుకున్నట్లుగా జరుగుతాయని, న్యాయ స్థానంలో తేలిన తరువాతే స్థానిక ఎన్నికల విషయంలో స్పష్టత వస్తుందని అన్నారు. ఎవరు ఏమన్నారో తనకు తెలియదు గానీ తమ ప్రభుత్వ విధానం మాత్రం 3 రాజధానులేనని అన్నారు. అన్ని సంప్రదింపులు చేసిన తరువాతే నిర్ణయం తీసుకున్నారని సమర్థించుకున్నారు. న్యాయ రాజధాని అనేది న్యాయ వ్యవస్థ పరిధిలో ఉంటుందని చెప్పారు. అది మినహా.. విశాఖ పరిపాలన రాజధానిగా.. అమరావతి శాసన రాజధానిగా ఖచ్చితంగా ఏర్పాటవుతాయన్నారు.
Also Read: వాలంటీర్లకు వైసీపీ షాక్ ట్రీట్మెంట్.. 35 ఏళ్లు దాటితే ఇంటికే..!











