నిమ్మ అంటే విటమిన్ సి.. విటమిన్ సీ అంటే నిమ్మ.. నిమ్మకాయలో విటమిన్ సీ పుష్కలం కాబట్టే చాలామంది తరుచుగా వాడుతున్నారు. కరోనా వైరస్ విరుచుకపడుతుండటంతో చాలామంది నిమ్మకాయలను ఎక్కువగా వాడుతున్నారు. నిమ్మ వైరస్ ను చంపకపోవచ్చమోకానీ.. రోగ నిరోధశక్తిని మాత్రం పెంచుతుంది. ప్రతిరోజు ఉదయం నీళ్లలో కాస్త నిమ్మరసం కలుపుకొని తాగడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తూ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఫలితంగా వైరస్ ను సమర్థంగా ఎదుర్కొవచ్చు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను కూడా తగ్గిస్తుందట. శరీరంలోని ప్రధాన అవయవాలపై ప్రభావం చూపి ఆరోగ్యంగా ఉండేలా కూడా చేస్తుంది.
ఇందులో విటమిన్ సి తోపాటు, విటమిన్ బి, కాల్షియం, పాస్పరస్, మెగ్నీషియం, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇది యాంటి సెప్టిక్‌గా కూడా పనిచేస్తుంది. నిమ్మ కాయలో 5 శాతం సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. అందుకే, నిమ్మను సకల రోగాల నివారణి అంటారు.
Must Read ;- ఇమ్యూనిటీ బూస్టర్.. ఈ నేరడు ఫ్రూట్