రక్షకులను కూడా అలా భక్షిస్తే ఎలా..?
జగన్ రెడ్డిని నమ్మి ఓట్లేసి గెలిపించిన ఉద్యోగులను నిలువున మోసం చేశారు. అలానే అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వానికి అండగా ఉండి, అన్ని విధాలుగా రక్షణ కల్పించే పోలీసులను సైతం మోసం చేశారు. హెచ్ఆర్ఏ, డీఏ, సిటీ అలవెన్స్ లలో కోత విధించి ఊహించని షాక్ ఇచ్చారు. మీకు జీతాలు తగ్గబోదంటూ ఇంతకాలం ప్రభుత్వం ప్రచారం చేసినప్పటికీ పే – స్లిప్పులు చూసి పోలీసులు కంగు తిన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనలో కీలకాంశమైన హెచ్ఆర్ఏ తగ్గింపు పోలీసులకు వర్తించబోదంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం చేసి, చివరికి కోత విధించి దెబ్బకొట్టింది ప్రభుత్వం. అయితే 23.29 శాతం ఫిట్మెంట్ లెక్కలేసి మొత్తం కూడితే జీతం తగ్గలేదన్న భావన కలిగించి, ఉద్యోగులను నిలువున దగా చేసింది. బుధవారం ఉదయం వచ్చిన పే స్లిప్స్ ల్లో హెచ్ఆర్ఏ వేలాల్లో వ్యత్యాసం కనిపించడంతో ఖాకీలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
హామీలన్నీ పచ్చిమోసం గురూ..
పోలీసులకు వీక్లీ ఆఫ్ అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్.. ఆ హామీ నేటికి కార్యరూపం దాల్చలేదు. అధికారులు, సిబ్బంది కొరతతో పని భారం, సెలవుల సరెండర్ ఇవ్వకపోవడం వంటి ఒత్తిడిని పోలీసు సిబ్బంది నేటికి తీసుకుంటూనే ఉన్నారు. ధర్నాలు, నిరసనలు, ఆందోళను, బందోబస్త్ వంటి సమయాల్లో ముందు గుర్తొచ్చేసి పోలీసులే! ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల నిరసనలను కంట్రోల్ చేయాలన్నా కూడా పోలీసులే కావాలి! అటువంటి వారికి కూడా హెచ్ఆర్ఏ తగ్గించి ఇంత ద్రోహం చేయడం అవసరమా? అని డిపార్ట్మెంట్ లోని పలువురు సినీయర్ అధికారులు, విశ్రాంతి ఉద్యోగులు వాపోతున్నారు. రాత్రింబవళ్లు ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షణగా నిలుస్తూ కొవిడ్ లో సైతం కుటుంబాలను వదిలి రోడ్లపై డ్యూటీలు చేసిన తమకు ఇంత అన్యాయం చేస్తారా? అని నిలదీస్తున్నారు. విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం వంటి పలు చోట్ల సిటీ అలవెన్సులు రద్దు చేసి, హెచ్ఆర్ఏలో 20 శాతం నుంచి 8 శాతం తగ్గించడం చాలా బాధిస్తుందని పోలీసులు వాపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పోలీసులకు వేతనాలు తగ్గబోవని చెప్పి, చివరికి 2 నుంచి 3 శాతం తగ్గించారని లబోదిబో మంటున్నారు. చివరికి ఉద్యోగ సంఘాలు, ఎన్జీవోలు చేస్తున్న ఉద్యమంలో న్యాయం ఉందని పోలీసులు కూడా ఒక క్లారిటీకొచ్చారు.
Must Read:-‘జగన్’ సన్నిహితుల ఆర్థిక వ్యవహారాలపై కేంద్రం నిఘా..?