Did Nature Retaliate Against China :
మనం ఏదైనా చేస్తే.. తిరిగి మనకు అదే వస్తుంది.. ఈ మాటలు డ్రాగన్ కంట్రీ చైనాకు అతికినట్టుగా సరిపోతాయి. ప్రపంచంలో ఏ విపత్తు జరిగినా… ఏ వైరస్ పేరు వినిపించినా అన్ని దేశాలకు మొదటగా చైనానే గుర్తుకొస్తుంది. వైరస్ లను పెంచి పోశిస్తుందనే చెడ్డ పేరు దేశానికి ఉంది. కొవిడ్ మహమ్మారి చైనాలో వెలుగుచూడటం.. ఇతర దేశాలకు వాపించడంతో ప్రపంచమంతా ఈ దేశంపై గుర్రుమంటోంది. అగ్రరాజ్యంగా అవతరించేందుకే చైనా ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందనే వాదన కూడా వినిపిస్తోంది. కరోనా పుట్టుక వుహన్ ల్యాబ్ లో జరిగిందనే మాటలు కూడా నేటికీ వినిపిస్తుంటాయి. అయితే ప్రకృతికి మనం ఏదైతే ఇస్తామో.. ప్రకృతి కూడా తిరిగి అదే ఇస్తుందనడానికి చైనా నిదర్శనంగా నిలుస్తుందని చెప్పక తప్పదు. ఇటీవల వరదలు చైనాను ముంచడం, భారీ నష్టాన్ని మిగలడ్చం చూస్తుంటే.. ప్రకృతి చైనాను పగబట్టిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వెయ్యేళ్ల కాలంలో..
చైనా వరదలతో విలవిల్లాడిపోతోంది. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలకు నదులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. హెనన్ ప్రావిన్స్ లో గతంలో ఎప్పుడూ లేనంతగా వర్షాలు ముంచెత్తాయి. 1000 సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు ఈ స్థాయిలో వర్షం కురవలేదని అక్కడి వాతావరణ శాఖ తెలియజేయడం గమనార్హం. ఇప్పటికీ కోట్లాది ప్రజలను రక్షించేందుకు సైనికులు ప్రయత్నిస్తున్నారు. పలు ప్రాంతాల్లోని వీధులు, సబ్‌వే టన్నెళ్లు వరదలకు చిక్కుకున్నాయి. మరో భారీ వర్షం కురిస్తే చైనా నీట మునగడం ఖాయమేనని తెలుస్తోంది.
నీటిపై తేలియాడుతున్న కార్లు
వరదల కారణంగా చైనాలో ఎక్కడా చూసినా కార్లు నీటిపై తేలియాడుతూ కనిపిస్తున్నాయి. వరదలో అనేక మంది చనిపోయారు. ఎంతోమంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. చైనాలో ఓ రైలు వరదలకు చిక్కిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక దేశంలో అనేక చోట్ల కమ్యూనికేషన్ సంబంధాలు దెబ్బ తిన్నాయి. వీధులు నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మరో కొన్నిరోజులపాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో చైనీయులు భయం భయంగా బతుకుతున్నారు.
Must Read ;- అన్ని వైరస్ లకు.. ఒకటే మందు!