కొవిడ్, డేల్టా, బీటా, గామా, డెల్టా ప్లస్.. ఇలా రకరకాల వైరస్ లు మనుషులపై దాడులు చేస్తున్నాయి. ఒక్కో వైరస్ నుంచి బయట పడేందుకు ఒక్కో మందును కనిపెట్టాల్సి వస్తోంది. అన్ని వైరస్ లను ఎదుర్కొనే ఒకే మందు ఉంటే బాగుంటుంది కదా. అవును కెనడా శాస్త్రవేత్తలు ఇప్పుడు ఇదే పనిచేస్తున్నారు. కరోనాలోని అన్ని వైరస్‌లపైనా పనిచేసేలా కెనడా శాస్త్రవేత్తలు ఓ ఔషధాన్ని తయారు చేస్తున్నారు. వైరస్ ప్రొటీన్‌లలో కాలపరీక్షకు తట్టుకుని నిలబడిన ‘డ్రగ్ బైండింగ్ పాకెట్ల’ను శాస్త్రవేత్తలు గుర్తించారు. పరిశోధనల్లో భాగంగా డ్రగ్ బైండింగ్ పాకెట్లు అన్ని రకాల వైరస్ లను సమర్థవంతంగా ఎదుర్కోంటుందని తేలింది. వీటి ఆధారంగా అన్ని రకాల వైరస్ లకు చెక్ పెట్టేవచ్చని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. వీటిపై మరిన్ని ప్రయోగాలు చేస్తే.. త్వరలోనే అన్ని రకాల వైరస్ లకు ఒకటే మందు రావొచ్చు.
Must Read ;- కొత్త వేరియంట్లకు ‘స్పుత్నిక్’ తో చెక్!











