పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. సలార్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం ఇటీవల హైదరాబాద్ లో సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఎవరు అనేది ప్రకటించలేదు కానీ.. బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని పేరు వినిపిస్తోంది.
ఈ సినిమాని ప్రకటించినప్పటి నుంచి ఇందులో ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది.? సినిమా స్టోరీ అనేది ఆసక్తిగా మారింది. కేజీఎఫ్ 2 టీజర్ రిలీజ్ అయిన తర్వాత సలార్ పై అంచనాలు రెట్టింపు అయ్యాయని చెప్పచ్చు. కారణం ఏంటంటే.. హీరో యశ్ ని చూపించిన విధానం ఆడియన్స్ కి తెగ నచ్చేసింది. దీంతో ప్రభాస్ ని సలార్ లో మరింత పవర్ ఫుల్ గా చూపిస్తారని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.
ఇదిలా ఉంటే.. కేజీఎఫ్ మూవీ 1970 ప్రాంతంలో కోలార్ బంగారు గనుల్లో పని చేసిన కార్మికుల జీవితాల ఆధారంగా తీసిన యాక్షన్ మూవీ. ఈ బ్యాక్ డ్రాప్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. ఇక సలార్ విషయానికి వస్తే.. ఈ మూవీ కూడా గోల్డ్ మైనింగ్ తరహాలో ఉంటుందని తెలిసింది.అయితే.. కోల్ మైనింగ్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది కానీ.. అది మేజర్ పార్ట్ అయితే కాదు అని టాక్. మొత్తానికి కేజీఎఫ్, సలార్ మధ్య పోలిక ఉంటుంది అంటున్నారు. మరి.. నిజమో కాదో తెలియాల్సివుంది.
Must Read ;- ఆ సిగరెట్ ‘కేజీఎఫ్ 2’ టీజర్ కొంపముంచింది!











