పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 27వ సినిమా ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఏ.యం.రత్నం నిర్మాణంలో ప్రస్తుతం సెట్స్ మీదున్న ఈ సినిమాకి ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మొఘలాయిల కాలం నాటి కథతో పీరియాడికల్ అండ్ హిస్టారికల్ ఫిక్షనల్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కోహినూర్ వజ్రం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు సినిమాకి హైలైట్స్ కానున్నాయట. ఇందులో పవన్ కళ్యాణ్ బందిపోటు నాయకుడిగా నటిస్తుండగా.. ఆయన సరసన కథానాయికగా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. మరో హీరోయిన్ గా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ అలరించనుంది.
ఇక ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన అప్టేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను సైలెంట్ గా జరుపుకున్న ఈ సినిమా మరో షెడ్యూల్ ను ప్రారంభించబోతోందట. అందులో పవన్ కళ్యాణ్ మీద ఓ షాడో ఫైట్ చిత్రీకరించబోతున్నారట. ప్రముఖ వీడియో గేమ్ నుంచి స్ఫూర్తిగా తీసుకొని డిజైన్ చేసిన ఈ ఫైట్ ను పవర్ స్టార్ మీద చిత్రీకరించ బోతున్నారట. సినిమాలో ఈ ఫైట్ గూస్ బంప్స్ కలిగిస్తుందట. అంతేకాదు.. ఈ సినిమా మొత్తానికే యాక్షన్ సీక్వెన్సెస్ ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తాయట.
Must Read ;- మార్చ్ 11న పవర్ స్టార్ అభిమానులకు పండగే .. !