పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాధేశ్యామ్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. భారీ పిరియాడిక్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే నటిస్తుంది. ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ సంక్రాంతికి వస్తుంది అనుకున్నారు కానీ.. ఎలాంటి అప్ డేట్ రాలేదు. దీంతో ఎప్పుడెప్పుడు రాధేశ్యామ్ అప్ డేట్ వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
అయితే.. రెబల్ స్టార్ కృష్ణంరాజు పుట్టినరోజు సందర్భంగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్ వ్యూలో రాధేశ్యామ్ గురించి అన్ని విషయాలు బయటపెట్టేశారు. ఇంతకీ రెబల్ స్టార్ ఏం చెప్పారంటే.. ఈ మూవీలో తను కీలక పాత్ర పోషిస్తున్నానని.. ఆ పాత్ర పేరు పరమహంస అని.. మహాజ్ఞాని, గొప్పవ్యక్తి పాత్ర అని చెప్పారు. ఆ పాత్ర కోసమే గడ్డం పెంచి కొత్త లుక్ ట్రై చేశానని అన్నారు.
ఇక ఈ మూవీ పొగ్రెస్ గురించి చెబుతూ.. తనకు, ప్రభాస్ మధ్య కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సివుంది. పాటల చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. గత సంవత్సరం డిసెంబర్ లో ఈ సినిమాని రిలీజ్ చేయాలి అనుకున్నాం. అయితే.. కరోనా కారణంగా కుదరలేదు. ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాం అని చెప్పారు.
Must Read ;- రెబెల్ స్టార్ తో యంగ్ రెబల్ స్టార్ అడుగులు











