పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ మూవీలో నటిస్తున్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ క్రేజీ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. రెబల్ స్టార్ కృష్ణం రాజు – పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మధ్య కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సివుంది. ఏప్రిల్ లో ఈ సినిమాని భారీ స్ధాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేయనున్న మూవీ సలార్.

ఈ చిత్రానికి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో ఈ సినిమాని గ్రాండ్ గా లాంఛ్ చేశారు. జనవరిలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్నారు కానీ.. రాధేశ్యామ్ వర్క్ కంప్లీట్ కాకపోవడం వలన ఇంకా స్టార్ట్ చేయలేదు. ఫిబ్రవరి నుంచి సలార్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదు కానీ బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని పేరు గట్టిగా వినిపిస్తుంది.
ఇక సలార్ లో నటించే విలన్ ఎవరనేది ఎనౌన్స్ చేయలేదు. అయితే.. కోలీవుడ్ క్రేజీ హీరో విజయ్ సేతుపతిని ప్రశాంత్ నీల్ ఫైనల్ చేసినట్టు సమాచారం. త్వరలోనే ఈ మూవీలో నటించే హీరోయిన్, విలన్ ఎవరనేది అఫిషియల్ గా ఎనౌన్స్ చేయనున్నారు. రికార్డ్ టైమ్ లో షూటింగ్ కంప్లీట్ చేసి ఈ పాన్ ఇండియా మూవీని దసరాకి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Must Read ;- ‘సలార్, కేజీఎఫ్’ రెండింటికీ పోలిక ఉందా.?











