సూపర్ స్టార్ మహేష్ బాబు – గీత గోవిందం డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో సర్కారు వారి పాట చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇటీవల దుబాయ్ లో షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రాన్ని 2022 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే.. మహేష్ నెక్ట్స్ మూవీ కోసం చాలా మంది దర్శకులతో చర్చలు జరుపుతున్నాడు కానీ.. ఇప్పటి వరకు తదుపరి చిత్రానికి ఇంకా సైన్ చేయలేదు.
ఇటీవల విడుదలైన తమిళ హీరో సూర్య సూరారై పోట్రూ మూవీ తెలుగులో ఆకాశం నీ హద్దురా టైటిల్ తో రిలీజైంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా డైరెక్టర్ సుధా కొంగ దర్శకత్వ ప్రతిభ, సూర్య నటనను సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ అభినందించారు. ఇదిలా ఉంటే.. సుధా ప్రస్తుతం రెండు స్క్రిప్ట్స్ రెడీ చేస్తున్నారు. ఈ రెండు స్క్రిప్టుల్లో ఒకటి మహేష్ బాబు కోసం కాగా రెండోది అజిత్ కోసమని తెలిసింది.
సుధా స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతోంది. త్వరలోనే మహేష్ ను సుధా కొంగర కలవనుందని సమాచారం. అయితే.. మహేష్ తదుపరి చిత్రం ఫైనల్ చేయడానికి ఇంకాస్త టైమ్ తీసుకోవాలి అనుకుంటున్నాడు కానీ.. ఇప్పటికిప్పుడు ఫిక్స్ చేసేయాలనే ఆలోచనలో లేరని సమాచారం. సుధా ఎప్పటి నుంచో తెలుగులో డైరెక్ట్ గా మూవీ చేయాలి అనుకుంటున్నారు. మరి.. మహేష్ తో సుధా కొంగర ప్రాజెక్ట్ సెట్ అవుతుందేమో చూడాలి.
Must Read ;- నానీ హీరోయిన్ తో రొమాన్స్ చేయనున్న సూర్య











