సుధా కొంగర తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆకాశం నీ హద్దురా‘. కెప్టెన్ గోపీనాథ్ జీవితం ఆదరంగా తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఇటీవలే ఓటీటీలో విదులైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ చిత్రం సూర్య అభిమానులకు నచ్చడమే కాకుండా విమర్శకుల ప్రశంసలను అందుకుంది. సూర్య సినీ జీవితంలో ఒక మంచి సినిమాగా ‘ఆకాశం నీ హద్దురా’ నిలుస్తుంది అనడంలో సందేహం లేదు.
సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని థియాటర్స్ లో కూడా రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది. అంతేకాకుండా బాలీవుడ్ లో కూడా ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఒక బడా నిర్మాణ సంస్థ ప్లాన్ చేస్తోంది. అంతటి ఘాన విజయం సాధించడానికి దర్శకురాలు సుధా కొంగర ప్రతిభే ముఖ్య కారణం అని అనడంలో అతిశేయోక్తి లేదు.
ఇప్పుడు ఈమె మరో వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నట్లు కోలీవుడ్ లో గుసగుసలు వినపడుతున్నాయి. సుధా, సూర్య తమ్ముడు హీరో కార్తీతో తన తదుపరి సినిమా చేయబోతున్నారని సమాచారం. ఇప్పటికే కార్తీ కోసం ఈ దర్శకురాలు ఒక కథ సిద్ధం చేసుకున్నారని, త్వరలోనే ఆయనను కలిసి ఆ కథ వినిపించనున్నారని తెలుస్తోంది. కార్తీకి కథ నచ్చితే వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత సినిమా షూటింగ్ మొదలుపెడతారని టాక్.
అయితే దర్శకురాలు సుధా ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తో సినిమా చేస్తున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అటు దర్శకురాలు సుధా కాని ఇటు హీరో అజిత్ కాని ఈవార్తపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. చివరికి ఆ వార్త ఒక ఫేక్ న్యూస్ గా మిగిలిపోయింది. ఇప్పుడు కార్తీతో, సుధా కొంగర సినిమా అంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే మరి.
Must Read ;- ‘ఆకాశమే హద్దుగా’ అపర్ణా బాలమురళికి క్రేజ్