బుధవారం అస్సాంలో సంభవించిన భారీ భూకంపం కలకలం రేపింది. 6.4గా తీవ్రతతో ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. ఒక బిల్డింగ్, మరో బిల్డింగ్ పైకి ఒరగడంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.4గా నమోదయ్యింది. ఈ భూ ప్రకంపననలు బెంగాల్, బీహార్ లోనూ కనిపించాయి. భూకంపం కారణంగా గౌహతిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అసోంలో భారీ భూకంపం వచ్చిందని, ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారు. హోంమంత్రి అమిత్‌షాతోపాటు, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కూడా దీనిపై స్పందించారు.
Must Read ;- మళ్లీ మంటలు : మహారాష్ట్రలో నలుగురు రోగులు మృతి











