అజేయ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ హీరోలుగా రూపొందుతోన్న కామెడీ ఎంటర్ టైనర్ ‘ఎఫ్ 3’. లాక్ డౌన్ ముగిసిన వెంటనే సెట్స్ మీదకు తీసుకెళ్ళిన అనిల్ .. ఇప్పటివరకూ చాలా స్పీడ్ గా చిత్రీకరణ జరిపాడు. ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. ఆగష్ట్ 27న రిలీజ్ డేట్ లాక్ చేయడంతో .. మరింత వేగంగా సినిమాను షూట్ చేస్తున్నారు.
అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండడంతో.. సినిమా థియేటర్స్ బంద్ అవడంతో పాటు.. పలు సినిమాలు తమ విడుదలల్ని వాయిదా వేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాను కూడా వాయిదా వేసే అవకాశాలున్నాయని టాక్ వినిస్తోంది. నిజానికి సంక్రాంతి సెంటి మెంట్ తో ‘ఎఫ్2, సరిలేరు నీకెవ్వురు’ సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టిన అనిల్ రావిపూడి.. ఈ ఏడాది సంక్రాంతిని కరోనా కారణంగా మిస్ చేసుకున్నాడు. అందుకే సినిమా కూడా లేట్ గా సెట్స్ మీదకు వెళ్ళింది. దాంతో ఆగస్ట్ 27న విడుదల చేసేందుకు సిద్ధమయ్యాడు అనిల్ .
అయితే ఈ విడుదలకు కూడా కరోనా బ్రేకులేస్తుండడంతో… ఎఫ్ 3 మూవీని వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడట. ఎలాగూ.. తనకి సంక్రాంతి సెంటిమెంట్ ఉంది కాబట్టి… 2022 సంక్రాంతికి ఎఫ్ 3 తో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకోవాలి అనుకుంటున్నాడట. మొదటి భాగాన్ని తోడళ్ళుళ్ళ ఫ్రస్టేషన్ మీద వర్కవుట్ చేస్తే.. రెండో భాగాన్ని వారి సంపాదన మీద, డబ్బు చుట్టూ హిలేరియస్ గా వర్కువుట్ చేయబోతున్నాడట. మరి ఎఫ్ 3 సినిమా నిజంగానే వచ్చే సంక్రాంతికి విడుదలవుందో లేదో చూడాలి.
Must Read ;- కరోనా తగ్గినా.. సినిమాల షూటింగ్స్ కు బ్రేక్!