జగన్‌ను నమ్ముకున్న అధికారులకు జైలు తప్పదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హెచ్చరించారు.కర్నూలు జిల్లా బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే,టీడీపీ నేత బీసీ జనార్థన్‌రెడ్డి అరెస్టుపై టీడీపీ నేతలు విర్చవల్ విధానంలో నిరసనకు దిగారు.బీసీ జనార్థన్‌రెడ్డి ఇంటి వద్ద గొడవ చేసి ఆపడానికి వచ్చిన వ్యక్తిపై అట్రాసిటీ కేసులు ఎలా పెడతారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు.టీడీపీ హయాంలో ముఠా,ఫ్యాక్షన్ రాజకీయాలకు చెక్ పెట్టామని చంద్రబాబు గుర్తు చేశారు.బీసీ జనార్థన్‌రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించే వ్యక్తి కాదని ఆయన గుర్తు చేశారు. అక్రమ అరెస్టులకు భయపడేదే లేదని ఆయన తేల్చి చెప్పారు.22 సంవత్సరాల టీడీపీ పాలనలో ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించలేదని చంద్రబాబు గుర్తు చేశారు.
అక్రమ కేసులతో నోరు మూయలేరు..
అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్షనాయకుల నోరు మూయలేరని చంద్రబాబు అన్నారు.వరుసగా టీడీపీ నేతలను అరెస్టు చేయడం ద్వారా నాయకుల మనోధైర్యం దెబ్బతీయాలని చూస్తున్నారని,టీడీపీ నాయకులు అక్రమ కేసులకు భయపడాల్సిన పని లేదన్నారు.అధికారం శాశ్వతం కాదు.అధికారులు జాగ్రత్తగా వ్యవహరించకపోతే వడ్డీతో సహా చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.అక్రమంగా పెట్టిన కేసులు వెంటనే ఎత్తి వేయాలని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.వరుసగా టీడీపీ నేతలను అరెస్టు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని అచ్చెన్నానాయుడు విమర్శించారు.
Must Read ;- బీసీ జనార్దన్ రెడ్డి అరెస్టు పై డీజీపీకి బాబు లేఖ : కర్నూల్ నేతలతో టెలి కాన్ఫరెన్స్











