దేశంలో మెట్రో మ్యాన్ అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు శ్రీధరన్. ఢిల్లీ మెట్రో రైల్ కు ఆద్యుడిగా, ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ ఎండీగా బాగా ప్రాచుర్యం పొందారు. అనుకున్న సమయానికన్నా ముందుగానే మెట్రో పనులు పూర్తి చేసి.. మెట్రో మ్యాన్ గా పేరు తెచ్చుకున్నారు. కేరళలోని తిరువనంతపురానికి చెందిన ఈ మెట్రోమ్యాన్.. రిటైరైన పదేళ్ల తర్వాత మళ్లీ వార్తల్లోకి ఎక్కారు.
'Metro Man' E Sreedharan to join BJP. He will formally join us during #KeralaVijayaYatra Yatra led by @surendranbjp pic.twitter.com/g8ZG3l8bT1
— BJP KERALAM (@BJP4Keralam) February 18, 2021
కేరళ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ.. శ్రీధరన్ బీజేపీలో చేరబోతున్నారు. ఎన్నికలకు కొన్ని నెలల ముందు దీన్ని కీలక పరిణామంగా భావించవచ్చు. ‘మెట్రో మ్యాన్’ శ్రీధరన్ బీజేపీలో చేరుతున్నారని కేరళ రాష్ట్ర శాఖ గురువారం ప్రకటించింది. ఈ నెల 21న రాష్ట్రంలో బీజేపీ ‘విజయ యాత్ర’ నిర్వహించనుంది. ఈ సందర్భంగా శ్రీధరన్ బీజేపీలో చేరుతారని రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సురేంద్రన్ ప్రకటించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే న్యాయం జరుగుతుందని, బీజేపీ ఒప్పుకుంటే తాను ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధంగానే ఉన్నానని ఆయన గతంలోనే ఓ సారి ప్రకటించారు. మరి చూడాలి.. ఈ మెట్రో మ్యాన్.. కేరళ బీజేపీలో ఏమాత్రం ఊపు తీసుకొస్తారో!
Must Read ;- లా కమిషన్ ఓకే అంటే.. ‘జమిలి’కి బీజేపీ జైనే











