ఇటీవల సినిమాల విషయంలో వివాదాలు ఎక్కువయ్యాయి. సంక్రాంతికి ‘క్రాక్’ సినిమా విడుదల విషయంలో కూడా వివాదం తలెత్తింది. దాంతో ఆ సినిమా షోలు పడటం ఆలస్యమైంది. తాజాగా ‘చక్ర’ విషయంలో కూడా వివాదం తలెత్తింది. హీరో విశాల్ నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 19న విడుదల కావలసి ఉంది. ఈ సినిమా కథపై హక్కులు తమకే చెందుతాయని నిర్మాత రవి మద్రాసు హైకోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు సినిమా విడుదలపై స్టే విధించింది. విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.
డిజిటల్ నేరాలకు చెందిన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఎం.ఎస్. ఆనందన్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, రెజీనా ప్రధాన పాత్రలు పోషించారు.తెలుగు, తమిళ భాషల్లో ఒకే సారి విడుదల చేయటానికి ఏర్పాట్లు చేశారు. యువన్ శంకర్ రాజా దీనికి సంగీతం సమకూర్చారు. ఈ సినిమా నిర్మాణంలో విశాల్ కు కూడా భాగస్వామ్యం ఉంది. హైకోర్టులో విచారణ పూర్తయితేగానీ ఈ సినిమా విడుదలపై స్పష్టత రాదు.
Must Read ;- విశాల్, అనిషా విడిపోయారా? .. నిజమేనా?











