కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం ఓంకార క్షేత్రంలో పూజారులపై జరిగిన దాడి సంఘటనపై దేవాదాయ శాఖ స్పందించి విచారణకు ఆదేశించింది. విచారణ అధికారులుగా తిరుపతి ఆర్జేసి వెంకటేశ్వర్లు, కర్నూలు అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేష నాయుడు, దేవాలయాల ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డిలను నియమించారు. విచారణ సందర్భంగా ఓంకార క్షేత్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. న్యాయం చేసేంత వరకు కదిలేది లేదంటూ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అదిశేషు నాయుడును అర్చకులు అడ్డుకున్నారు. అసభ్య పదజాలంతో ఆయన్ను అర్చకుడు దూషించాడు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ముఖంపై అర్చకుడు సతీష్ ఉమ్మి వేశాడు. పూజారులపై దాడికి కారణమైన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులైన ఈశ్వరయ్య,నాగరాజులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే దాడికి కారణమైన దేవాలయ కమిటీ ఛైర్మన్‌పై చర్య తీసుకోలేదంటూ అర్చకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేవాలయ ట్రస్టు బోర్డు,ఈఓపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని రీజనల్ జాయింట్ కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు. బాధిత అర్చకులకు న్యాయం చేస్తామని అధికారులు తెలిపారు.
Also Read: శభాష్ ఢిల్లీ… అందరూ ఇలా ఫాలో అవ్వాలి










