మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవీకి గుడ్ బై చెప్పిన విషయం విధితమే. త్వరలోనే తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ అందిస్తానని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఢిల్లీలో బీజేపీ అగ్రనేతల సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకుంటానని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు టీఆర్ఎస్ కుట్ర చేసిందని ఆరోపించారు. హుజూరాబాద్ ప్రజలు తన వెంట ఉంటారని, ప్రలోభాలకు లొంగిపోరని అన్నారు. టీఆర్ఎస్ అసంతృప్తి ఎమ్మెల్యేలు తన వచ్చేందకు సిద్ధమని ఈటల రాజేందర్ అన్నారు. ఈటల బీజేపీ చేరికపై రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఈటల చేరికతో పార్టీ బలోపేతం అవుతుందన్నారు. ఉద్యమశక్తులకు తమ పార్టీ చోటు కల్పిస్తుందని ఈటలకు మద్దతు పలికారు.
Must Read ;- అది ప్రగతి భవన్ కాదు.. బానిస భవన్: ఈటల రాజేందర్











