మీ బతుకులు చెడ, ఇంత నీచమైన పాలన అందిస్తారా అంటూ వైసీపీ నేతలపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లాలో రైతుల వద్ద నుంచి 75 కిలోలకు బదులుగా 80 కిలోల ధాన్యం తీసుకుని వైసీపీ నేతలు దోపిడీకి పాల్పడుతున్నారని దేవినేని విరుచుకుపడ్డారు. వరి రైతులు ఎకరాకు 30 నుంచి 40 వేలు పెట్టుబడి పెట్టినా వారికి చివరకు రూ.2000 కూడా మిగలడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కళ్ల ముందే ఇంత దగా జరుగుతున్నా సీఎం జగన్మోహన్‌రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని దేవినేని ప్రశ్నించారు. చేతగాని, అసమర్థ ప్రభుత్వమని ఆయన మండిపడ్డారు. రైతుల కన్నీరు సీఎంకు కనిపించడం లేదా అని దేవినేని ప్రశ్నించారు.
Devineni Uma Fires on YCP ruling :
మీబతుకులు చెడ.. మీదొక పాలనా..
ధాన్యం రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదని అడిగితే మంత్రులు బూతులు మాట్లాడుతున్నారని దేవినేని గుర్తు చేశారు. రాష్ట్రంలో అన్నీ పంచాయతీలు తామే గెలిచామని చెప్పుకునే ముఖ్యమంత్రికి రైతుల కష్టాలు కనిపించడం లేదా అని ఆయన వెంకటగిరిలో ప్రశ్నించారు. వెంటనే మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని దేవినేని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Must Read ;- వైసీపీకి దిమ్మతిరిగే షాక్ : వాట్సాప్ చేస్తే, 10 వేలు











