MLA Roja Discharged from Chennai Hospital :
రెండు మేజర్ సర్జరీలు చేసుకున్న ఎమ్మెల్యే రోజా చెన్నై మలర్ ఆస్పత్రిలో చికిత్స శనివారం డిశ్చార్జి అయ్యారు. సురక్షితంగా ఆమె ఇంటికి చేరుకున్నారు. భర్త ఆర్కే సెల్వమణి, కుమార్తె అన్షుమాలిక, కుమారుడు కృష్ణకౌశిక్, కుటుంబ సభ్యులు ఆమెను కలుసుకున్నారు. చెన్నైలోని స్వగృహాంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడే వరకు ఆమె చెన్నై ఇంటిలోనే విశ్రాంతి తీసుకుంటారు. రోజా త్వరగా కోలువాలని వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పూజలు చేశారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రోజా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు. త్వరగా కోలుకొని, మళ్లీ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టాలని కోరారు. నిజానికి గత ఏడాదే రోజాకు సర్జరీ చేయాల్సి ఉంది. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో సర్జరీని వాయిదా వేశారు. అయితే తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక పూర్తయ్యేంతవరకూ రోజా సర్జరీని వాయిదా వేయాలని కోరింది. అది మంచి నిర్ణయం కాదని వైద్యులు సూచించడంతో రోజా చికిత్సలు చేయించుకున్నారు.
Also Read : ఆస్పత్రిలో రోజా.. క్లారిటీ ఇచ్చిన సెల్వమణి











