`శనిదేవుడు’ చిత్రాన్ని మినహాయిస్తే,
మాస్ కథలతో సినిమాలను తీస్తూ, వాటిలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహిస్తుంటారు శివ జొన్నలగడ్డ. `మాస్ పవర్`, పోలీస్ పవర్` చిత్రాల తర్వాత ఆయన నటించిన తాజా చిత్రం `సూపర్ పవర్`.సర్వేశ్వర మూవీస్ పతాకంపై డా.గుద్దేటి బసవప్ప మేరు ఈ చిత్రాన్ని తీస్తున్నారు. ఇందులో శివ జొన్నలగడ్డ సరసన ప్రియ అగస్టిన్, మీర హీరోయిన్లుగా నటించారు. కాగా. ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ శనివారం హైదరాబాద్ లోని
ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది.
అతిథి గా విచ్చేసిన పాత్రికేయుడు, నిర్మాత
సురేష్ కొండేటి చేతుల మీదుగా ట్రైలర్ విడుదలైంది. ఈ సందర్భంగా సురేష్ కొండేటి మాట్లాడుతూ, “శివ జొన్నలగడ్డ తొలి సినిమా `మాస్ పవర్`కు థియేటర్లలో వచ్చిన ప్రేక్షకాదరణ చూసి చాలా ఆశ్చర్యం కలిగింది. ఆయన చేసే సినిమాలు యాక్షన్ నేపథ్యంలో ఉంటుంటాయి. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ చుసిన తర్వాత అక్షరాలా అది నిజమనిపించింది. ఈ ట్రైలర్ కూడా చాలా బావుంది..మళ్లీ థియేటర్లు ప్రారంభమైన ఈ దశలో 50 శాతం ఆక్యుపెన్సీ అనే రూల్ చిన్న సినిమాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.` అన్నారు.
హీరో, దర్శకుడు శివ జొన్నలగడ్డ మాట్లాడుతూ, `ఈ చిత్రంలోని హీరోకి కథాపరంగా ఎన్ని అవరోధాలు ఎదురైనా వాటిని ఎలా అధిగమించి `సూపర్ పవర్` కప్పును ఏవిధంగా సాధించాడు అన్నది తెరపై చూసి ఆనందించాల్సిందే.
మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగుతుంది. చిత్రంలో ఐదు ఫైట్స్ ఉన్నాయి. చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వతహాగా నేను
డాన్స్ మాస్టర్ ను. ఈ చిత్రంలో అది మిస్సయ్యాను. అయితే మిగతా అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో ఉన్నాయి..మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ గార్ల స్పూర్తితో నేను సినీరంగంలోనికి వచ్చాను, ఇకపై నేను చేయబోయే సినిమాలలో డాన్స్ మిస్ కాకుండా చూసుకుంటా’ అని అన్నారు.
నిర్మాత డా. గుద్దేటి బసవప్ప మేరు మాట్లాడుతూ, `శివ నటించిన తొలి చిత్రానికి నేనే నిర్మాతను. ఆ చిత్రం ప్రేక్షకాదరణ పొందింది. త్వరలో సినిమా విడుదల తేదీని తెలియజేస్తాం` అని చెప్పారు. హీరోయిన్ ప్రియ అగస్టిస్ మాట్లాడుతూ, శివ రూపొందిస్తున్న ప్రతీ సినిమాలో తనకు అవకాశం కల్పిస్తున్నారని అన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రలలో మధు నారాయణ్, శివలీల, కనక దుర్గ, కొండేకర్ బాలాజి, కొండేకర్ రాజ్,నందిని, కొండేకర్ స్నేహాల్, తదితరులు తారాగణం..ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శివ, పాటలు: కొండేకర్ బాలాజి,సంగీతంః ఎల్ ఎమ్ ప్రేమ్, ఫైట్స్ః దేవరాజ్, నూనె, బాలు, నిర్మాత: డా.గుద్దేటి బసవప్ప, కథ, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శివ జొన్నలగడ్డ.