వరుస విపత్తులతో నష్టపోయిన రైతులకు ధాన్యం బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. పంట భీమా, ధాన్యం కొనుగోలు, మద్దతు ధరకు పంట కొనుగోలు చేయడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శలొస్తున్నాయి. ఏపీలో 16 లక్షలపైగా కౌలు రైతులు ఉన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా.. ఏ ఒక్క రైతుకూ ఎలాంటి సాయం అందడం లేదు. ధాన్యం కొనుగోలు చేసి నెలలు దాటుతున్నా.. బకాయిలు చెల్లించకపోవడంతో పస్తులుండే పరిస్థితులు నెలకొన్నాయి. బకాయిలు అందని కారణంగా ఇప్పటికే ఏపీలో నారుమళ్లు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి.
4 వేల కోట్ల పైనే
రైతులకు చెల్లించాల్సిన బకాయిలు ఇప్పటికే 4 వేల కోట్ల పైనే ఉన్నాయని తెలుస్తోంది. ఒక్క గోదావరి జిల్లాల్లోనే రూ.2500 కోట్ల బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ధరకు, ప్రైవేట్ వ్యాపారులకు పొంతన లేకపోవడంతో రైతులకు పెట్టుబడులు కూడా దక్కడం లేదు. తమ పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి, మద్దతు ధర చెల్లించాలని రైతులు ఆందోళన బాట పడుతున్నారు.
ఆందోళనలో రైతులు
ధాన్యం డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో విజయవాడలోని రెడ్డిగూడెం రైతులు ఆందోళనకు దిగారు. తహసీల్దార్ ఆఫీస్ ఎదుట చెట్లు ఎక్కి రైతులు నిరసన చేపట్టారు. ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలని నినాదాలు చేశారు. సీఎం, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎండ్రిన్ డబ్బా ఇవ్వండి లేదా డబ్బులైనా ఇవ్వండి అంటూ ఆవేదనను వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్‌కు టీడీపీ నాయకులు, రైతులు కలిసి వినతిపత్రం అందజేశారు.
Must Read ;- ఆ నేత చనిపోయినా.. టీడీపీ పోరు ఆగలేదు
పండించిన పంటకు గిట్టుబాటు ధరలేదు. కొనుగోలు చేసిన ధాన్యంబకాయిలు చెల్లించరు. నష్టపోయిన పంటకు పరిహారంఇవ్వరు. ఎన్నికల ముందు చెప్పిన మద్దతుధర, ధరలస్థిరీకరణ నిధి ఎక్కడ ? మా దాన్యం డబ్బులు ఎప్పుడు చెల్లిస్తారు అంటూ రోడ్డెక్కిన అన్నదాతల ఆక్రందన వినపడుతుందా ? @ysjagan pic.twitter.com/6JXcK5ZTJ1
— Devineni Uma (@DevineniUma) July 16, 2021