గ్రేటర్ ఎన్నికలు ఆ రెండు పార్టీలకు కీలకం కానున్నాయి. తెలంగాణ భవిష్యత్ రాజకీయాలను శాసించే విధంగా ఈ ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఓ పార్టీ తెలంగాణలో ఎదిగేందుకు ఉత్సాహం చూపిస్తుంటే.. మరో పార్టీ పట్టు నిలబెట్టుకునేందుకు అవస్థలు పడుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో రోజుకో అస్త్రంతో బీజేపీ దూసుకు పోతుంటే … బీజేపీకి కౌంటర్ ఇచ్చేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఇరు పార్టీ ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రోజుకో కాంట్రవర్సీతో బీజేపీ ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది.
దూకుడుగా బీజేపీ..
గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ తనదైన శైలిలో దూసుకుపోతోంది. ఉత్తారాది తరహాలో స్ట్రాటజీ వర్కౌట్ చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నోటీకి పని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. ఎట్టి పరిస్థితుల్లో మేయర్ పీఠం దక్కించుకోవాలని భావిస్తున్న బీజేపీ అధికార టీఆర్ఎస్‌ను డిఫెన్స్‌లోకి నెట్టేందుకు రోజుకో కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తున్నారు. సాంప్రదాయాలకు భిన్నంగా పార్టీ నేతలు స్టేట్‌మెంట్స్ ఇస్తుండటంతో ప్రజలు ఆ పార్టీ వైపు చూస్తున్నారు. ఇక బీజేపీ నేతల రోడ్ షోలకు కూడా యువత నుండి మంచి స్పందన వస్తోందని భావిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని.. పాత మేనిఫెస్టోనే తిరిగి కొత్త పుస్తకాల్లో ముద్రించి మరోసారి మోసం చేసే పనిలో ఉందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎక్కువగా రోడ్ షోలు నిర్వహిస్తూ.. మీడియాలో కూడా అదే తరహాలో తమ ప్రచారం కవర్ అయ్యేలా జాగ్రత్త పడుతూ బీజేపీ తనదైన శైలిలో ప్రజలకు దగ్గరవుతోంది.
Must Read ;- గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి బాలయ్య, లోకేష్!
కేటీఆర్ రోడ్ షోలు
ఇక టీఆర్ఎస్ సైతం తమ అభివృద్ధి కార్యక్రమాల ప్రచారంతో పాటు బీజేపీని అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. మాటకు మాట సమాధానం చెబుతూ ప్రచారంలో కేటీఆర్ దూసుకు పోతున్నారు. రోజుకు కనీసం ఎనమిది రోడ్ షోలు నిర్వహిస్తున్న ఆయన మీడియా సమావేశాలు కూడా నిర్వహిస్తూ బీజేపీపై విమర్శలు చేస్తున్నారు. ఇక ట్విటర్‌ను కూడా ఆయన సమర్దవంతగా వినియోగించుకుంటూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ చేస్తున్న కాంట్రవర్సియల్ కామెంట్స్‌ను సమర్ధవంతంగా తిప్పికొడుతున్న ఆయన .. ఏ చిన్న అవకాశం వచ్చినా ప్రజల్లో బీజేపీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఇరు పార్టీల నేతల మాటల దూకుడుతో గ్రేటర్ పీఠం ఎవరికి దక్కుతుందన్నది సస్పెన్స్‌గా మారింది.
Also Read ;- అమరావతికి ఇచ్చింది మట్టి, నీళ్లేగా.. బీజేపీ నేతలకు కేటీఆర్ కౌంటర్