గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ , టీఆర్‌ఎస్ నేతల మధ్య ఘాటైన మాటల యుద్ధం నడుస్తోంది. గెలిపిస్తే అది చేస్తాం.. ఇది చేస్తామంటూ ఇరు పార్టీల నేతలు ఓటర్లను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రేటర్ పీఠం ఎక్కిస్తే ఎంతో చేస్తామంటున్న బీజేపీ నేతలకు మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వారు చేప్పే మాటలకు చేతలకు పొంతన ఉండదన్నారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రంలోని బీజేపీ ఇచ్చింది ఏమి లేదన్నారు. దీనికి ఏపీ రాజధాని అమరావతే నిదర్శనమని పేర్కొన్నారు.
Also Read:-ఆ హామీలు ఏమయ్యాయి కేటీఆర్ సార్?
అమరావతి శంకుస్థాపన సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీకి మించిన రాజధాని నిర్మాణానికి సహకరిస్తామని చెప్పి తర్వాత పట్టించుకోలేదని కేటీఆర్ విమర్శించారు. అమరావతికి ఇచ్చింది మట్టి, నీళ్లేగా అని ఆయన వ్యాఖ్యానించారు.