నమ్ముకున్న నాయకులే నట్టేట్లో మునిగారు!
జగన్ రెడ్డిని నమ్మి, గెలిపించుకున్నందుకు మమ్మల్ని నట్టేట్లో ముంచాడని అధికారపార్టీకి చెందిన సీనియర్ నేతలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అధికారపార్టీలో అసంతృప్తి నేతల లిస్ట్ రోజురోజుకు చాంతాడంత అవుతోంది. తాజాగా శ్రీకాకుళం ఎమ్మెల్యే, ఆ పార్టీ సీనియర్ నాయకులు ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ కేంద్రాలను నిర్మిస్తున్న వైసీపీ నాయకులను జగన్ రెడ్డి పట్టించుకోవడంలేదని వాపోయ్యారు. వీటి నిర్మాణాలకు పార్టీ నాయకులు శక్తికి మించి ఖర్చు చేస్తున్నారని, 14 శాతం లాభం చేకూరిస్తే అందులో తప్పేముందని అసంతృప్తిని వెల్లగక్కారు. ఉపాధి హామి పథకం కాంపోనెంట్ నిధులతో కోట్ల వెచ్చించి భవనాలను నిర్మింస్తున్నారని, భవన నిర్మాణ సామాగ్రి విపరీతంగా పెరిగాయన్నారు. అధికారులు తక్కువ ధరలు నిర్ణయించి, మార్జిన్లు తీసేస్తే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేయడం విస్మయానికి గురిచేస్తోంది. సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాలను విజయవంతం చేయడానికి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, స్థానిక నేతలు తమ శక్తికి మించి ఖర్చుపెట్టి నిర్మిస్తున్నారని, అటువంటి వారిని ఇబ్బందులు పెట్టడం సబబు కాదని హితవు పలికారు. ధర్మాన అసంతృప్తిలో నిజాలు లేకపోలేదని బాధిత నాయకులు విమర్శిస్తున్నారు.
నమ్మిన పాపానికి రోడ్డుపాలయ్యాం!
ఓదార్పు నుంచి మొన్నటి పాదయాత్ర వరకు జగన్ రెడ్డి పిలుపునిచ్చిన అన్నికార్యక్రమాలకు నేతలు, కార్యకర్తలు శక్తికి మించి అన్ని చేశారు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మమ్మల్ని విస్మరించి, రోడ్డుపాలు చేశాడన్నది ఆ పార్టీలో సీనియర్ల వాదన. ఆయన అడుగుల్లో అడుగులు వేసుకుంటూ నడిచారు. జైల్లో జగన్ ఉన్నప్పుడు .. పార్టీకి, కుటుంబానికి అండగా నిలబడ్డారు. ఆ తరువాత 2014 ఓటమి పాలైనప్పుడు ఎంతో అండగ నిలుచున్నారు. 2017 పాదయాత్రలో తొడై సాగారు. 2019 ఎన్నికల్లో జగన్ విజయం తరువాత నమ్ముకున్న చాలా మంది సీనియర్ల చరిత్ర తిరగబడింది. కొంతమంది నేతలు ఆయన ప్రవర్తన శైలి, లెక్కచేయని తనం చూసి విసిగి దూరంగా జరిగారు. అంతేకాక గతంలో పొల్చకుంటే అధికారంలోకి వచ్చిన నాటినుంచి జగన్ తో నేతలకు, కేడర్ కు చాలా గ్యాప్ పెరుగిందని చెప్పవచ్చు. గ్యాప్ మాట పక్కన పెడితే కార్యకర్తలు, నాయకుల సంక్షేమంపై గడిచిన మూడేళ్లుగా ఎటువంటి దృష్టి సారించలేదని సొంతవాళ్లే విమర్శిస్తున్నారు. జిల్లాల వారీగా చేసుకుంటే పదుల సంఖ్యలో అసంతృప్తి వాదుల లిస్ట్ ఉంటుంది. అందులో ముందు వరుసలో ఎమ్మెల్యేలు, రెండో వరసలో సీనియర్ నేతలు, కార్యకర్తలు ఉన్నారని అధికారపార్టీ నుంచి అందుతున్న లీకులు. రాష్ట్రంలో జగన్ రెడ్డి అనేక తేనె తుట్టలను కదిలించుకుని ఎలా భంగపడ్డారో.. అలానే సొంతవాళ్లును కూడా పక్కనపెట్టి అసంతృప్తి వాదమనే తుట్టను కదిలించుకుంటున్నారని ఈ మధ్య ఎమ్మెల్సీ పదవిని ఆశించి భంగపడ్డ ఆ పార్టీకి చెందిన గుంటూరు నేత ఒకరు మీడియాకు చెప్పుకుని వాపోయినట్లు సమాచారం.
Must Read ;- లోకల్ వార్లో నైతిక విజయం టీడీపీదే!