కుప్పం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ బుధవారం ఉదయం ప్రారంభమైంది. కౌంటింగ్‌కు ముందుగా ఉద్యోగుల పోస్టల్ బాక్స్ ను ఒపెన్ చేసి చూసే సరికి, లెక్కింపు కేంద్రంలోని వారంతా అవాక్కయ్యారు. బాక్స్ అంతా ఖాళీగా ఉంది. ఎన్నికల నిర్వహించే అధికారులు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా ముందుగా వినియోగించుకుని, ఆ తరువాత ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. అటువంటిది అధికారపార్టీ కుప్పంలో చేసేసిన అరాచకాలు, ఉద్యోగుల డిమాండ్స్ ను, పీఆర్సీపై జగన్ రెడ్డి అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగానేమో కానీ, ఉద్యోగుల ఓటు హక్కును వినియోగించుకోవడానికి విముఖత వ్యక్తం చేసినట్లు కనిపించింది. కుప్పం మున్సిపాలిటీలో ఉద్యోగుల ఓటు హక్కును ఎందుకు వినియోగించుకోలేదు అన్న అంశమే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
కుప్పంలో ఉద్యోగులు ఏ పార్టీకి ఓటు వేయకుండా నిరసన వ్యక్తం చేశారు. ప్రధానంగా ప్రస్తుత ప్రభుత్వం నుంచి తమకు సంతృప్తి లేదని చాలా స్పష్టంగా చెప్పారు. అనాదిగా ఉద్యోగుల సమస్యలు, పీఆర్సీ వంటివి తీర్చదగ్గ కోర్కేలే అయినప్పటికీ జగన్ రెడ్డి వారంవారం అంటూ తాత్సరం చేస్తున్నారని, ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఈ నెలాఖరు వరకు డెడ్‌లైన్ విధించిన సంగతి విదితమే.
Must Read ;- మార్పు మొదలైంది..! మిగిలింది పతనమే!!