ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలంటూ ప్రభుత్వ ఉద్యోగుల పెడరేషన్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది. స్థానిక ఎన్నికలు నిర్వహించుకోవచ్చని నిన్న హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఉగ్యోగుల ఫెడరేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కరోనా వ్యాక్సినేషన్ పూర్తి కానందున ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనలేమని, స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని పిటీషన్ లో కోరారు.
రంగంలోకి ఉద్యోగ సంఘాలు
ఓ వైపు ఏపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య కూడా ఇవాళ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది. కరోనా వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకు ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిలిపివేయాలని ఉద్యోగ సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఉద్యోగుల పిటీషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ విచారించే అవకాశం ఉంది.
Must Read ;- వీడని ‘స్థానిక’ చిక్కుముడి.. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం సుప్రీంలో సవాల్