రానాతో ‘హిరణ్యకశ్యప’ పౌరాణిక చిత్రం తీయాలనుకున్న దర్శకుడు గుణశేఖర్ .. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టి.. తన సొంత నిర్మాణంలో ‘శాకుంతలం’ అనే మరో పౌరాణిక సినిమాకి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ప్రకటించిన రోజు నుంచి సెట్స్ నిర్మాణ పనులు ప్రారంభించారు గుణశేఖర్. ప్రస్తుతం ఆ పని తుది దశకి చేరుకుంది. మరో పక్క స్ర్కిప్ట్ వర్క్ ను కూడా పూర్తి చేశారు. శకుంతలగా సమంత నటించబోతున్న ఈ సినిమా షూటింగ్ ను వచ్చేనెల 20 నుంచి ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు గుణశేఖర్ .

మణిశర్మ సంగీత సారధ్యం వహిస్తున్న ఈ సినిమా ట్యూన్స్ కూడా రెడీ అవుతున్నాయి. మహాభారతం ఆదిపర్వంలో శకుంతల, దుష్యంతుల ప్రణయ గాథను .. ఇప్పటి జెనరేషన్ కు తెలియజేసే ఉద్దేశంతో .. ఈ సినిమాను హై టెక్నికల్ స్టాండర్ట్స్ తో తీర్చిదిద్దేందుకు రెడీ అవుతున్నారు గుణశేఖర్. దాంతో సినిమాకి భారీ గ్రాఫిక్స్ , మనోహరమైన సెట్టింగ్స్ అవసరమవుతాయి. అందుకే టెక్నాలజీ విషయంలో రాజీ పడకుండా.. ‘శాకుంతలం’ సినిమాను నెవర్ బిఫోర్ అనే స్థాయిలో రూపొందించబోతున్నారు గుణశేఖర్. త్వరలోనే దుష్యుంతుడి పాత్రను కూడా రివీల్ చేయబోతున్నారు. నిజానికి మలయాళ నటుడు దేవ్ కమల్ ను ఆ పాత్రకోసం ఎంపిక చేశారనే టాక్స్ వినిపించాయి. మరి అతడ్నే ఫైనల్ చేస్తారా లేదా అనేది చూడాలి.
Must Read ;- పాన్ ఇండియా దిశగా శాకుంతలం











