Guntur Software Woman Cheated By Co-Worker :
ప్రేమ పేరుతో లైంగిక కోరికలు తీర్చుకొని.. సాఫ్ట్ వేర్ యువతిని దారుణంగా మోసం చేసిన సంఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువతి బిటెక్ చదివింది. ఓ ప్రముఖ కంపెనీలో టెక్కీగా పనిచేస్తోంది. ఐదు అంకెల జీతం, లగ్జరీ లైఫ్ సవ్యంగా సాగుతున్న ఆ అమ్మాయి జీవితంలోకి ఓ అబ్బాయి ప్రవేశించాడు. తాను కూడా సాఫ్ట్ వేర్ గా పనిచేస్తుండటంతో ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. యువకుడిది ఏపీలోని చిత్తూరు జిల్లా కావడంతో పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఐ లవ్ యూ అంటూ ప్రపోజ్ చేశాడు. యువకుడు కూడా సహోద్యోగి కావడంతో యువతి ఓకే చెప్పింది.
శారీరకంగా లోబర్చుకొని..
సినిమాలు, షికార్లు అంటూ తిరిగారు. పెళ్లి చేసుకుంటానని భరోసా ఇవ్వడంతో అమ్మాయి మరింత దగ్గరైంది. ఇదే అవకాశంగా భావించిన యువకుడు శారీరకంగా లోబర్చుకున్నాడు. మూడేళ్లు సహజీవనం చేశాడు. లైంగిక వాంఛలు తీర్చుకున్నాడు. లాక్ డౌన్ కారణంగా అమ్మాయి ఏడాదిన్నర నుంచే ఇంటి దగ్గర పనిచేస్తోంది. అయితే సడన్ గా ఏమైందో ఏమో.. ప్రేమించిన అబ్బాయి ఫొటోలు మ్యాట్రిమోనీ సైట్ లో ప్రత్యక్షమయ్యాయి. విషయం తెలుసుకున్న అమ్మాయి ఎన్నోసార్లు ఫోన్ చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరకు తల్లిదండ్రులతో వెళ్లి ప్రశ్నించగా.. తక్కువ కులం వారిని పెళ్లి చేసుకోమంటూ చెప్పేశాడు. దీంతో మోసపోయాననే విషయం ఆ అమ్మాయికి చాలా ఆలస్యంగా అర్ధమైంది.
పోలీసులకు ఫిర్యాదు
పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి సహోద్యోగిక తనను శారీరకంగా వాడుకున్నాడని గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బాధితురాలు సోమవారం అర్బన్ ఎస్పీ కార్యాలయానికి వెళ్లింది. మోసంచేసిన యువకుడ్ని శిక్షించాలని కోరింది. గతంలో ఆమెకు రెండు కిడ్నీలు పాడయ్యాయి. ఆమె తండ్రి ఒక కిడ్నీ దానం చేసి కూతురిని కాపాడుకున్నారు. ఆమె బాగా చదువుకుని టెక్కీగా ఉద్యోగం సాధించింది. ఈ సంఘటనతోనైనా అమ్మాయిలు ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Must Read ;- ప్రేమ పేరుతో కోరిక తీర్చుకొని.. మహిళా టెక్కీని మోసం చేసి!











