కోలీవుడ్ సీనియర్ దర్శకుడు పి. జననాథన్ గుండెపోటు తో మృతి చెందారు. ఆయన వయసు 61 సంవత్సరాలు. చెన్నైలోని అపోలో హాస్పిటల్ చికిత్స నిమిత్తం చేరిన ఆయన ఈవేళ తుదిశ్వాస విడిచారు. 2003 లో విడుదలైన అయ్యర్ కై సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన జననాథన్ .. తొలి సినిమాతోనే నేషనల్ అవార్డు అందుకున్నారు. తన కెరీర్ లో మొత్తంగా నాలుగు సినిమాలు మాత్రమే తెరకెక్కించిన ఆయన చివరి చిత్రం విజయ్ సేతుపతి హీరోగా నటించిన లాభం.
కోలీవుడ్ లో త్వరలో విడుదల కానున్న లాభం చిత్రం .. ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో భాగంగా రేయింబవళ్ళు ఎడిటింగ్ టేబుల్ వద్దే కూర్చున్న ఆయన .. నాలుగు రోజుల క్రితం లంచ్ కని ఇంటికి వెళ్ళి తిరిగిరాలేదు. దాంతో అసిస్టెంట్స్ .. ఆయన రూమ్ కి వెళ్ళి చూడగా.. స్పృహలేని స్థితిలో ఉన్నారు జననాథన్. వెంటనే ఆయన్ను చెన్నైలోని అపోలో హాస్సిటల్ కి చికిత్సకై తరలించారు. మెదడులో బ్లడ్ క్లాట్ అయినట్టు డాక్టర్స్ తెలియచేశారు. అప్పటి నుంచి ఆయన హాస్పిటల్ లో కోమాలో ఉన్నారు. ఆయన మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియచేశారు.
Must Read ;- ఆర్ధిక సహాయం చేసి నా ప్రాణం నిలబెట్టండి : పొన్నంబళం