దివంగత టాలీవుడ్ దర్శకుడు శోభన్ తనయుడు .. సంతోష్ శోభన్ పేపర్ బాయ్ మూవీతో టాలీవుడ్ లో తెరంగేట్రం చేశాడు. అయితే ఆ సినిమా అనుకున్నంత రీతిలో ఆడకపోవడంతో ఆ కుర్రాడు కాస్తంత నిరాశ చెందాడు. అయితే ఇటీవల ఓటీటీలో విడుదలైన ‘ఏక్ మినీ కథ’ అనే బోల్డ్ కంటెంట్ మూవీతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎలాంటి వల్గారిటీ లేకుండా.. నీట్ గా ప్రెజెంట్ చేయడంతో విమర్శకుల ప్రశంసల్ని సైతం దక్కించుకుంది సినిమా.
‘ఏక్ మినీ కథ’ సినిమా తెచ్చిపెట్టిన క్రేజ్ తో సంతోష్ శోభన్ కు పలు అవకాశాలు వస్తున్నాయి. ఆ క్రమంలో అతడు హీరోగా నటిస్తోన్న మరో సినిమా ‘ప్రేమ్ కుమార్’. అభిషేక్ మహర్షి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో రాశీ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను ఈ రోజు అధికారికంగా ప్రకటించారు. దాంతో పాటు సినిమా టైటిల్ పోస్టర్ ను సైతం రివీల్ చేశారు. పెళ్ళికొడుకు అవతారంలో చేతిలో తాళిబొట్టు భూతద్దంతో సంతోష్ శోభన్ పోస్టర్ మీద కనిపిస్తున్నాడు.
ప్రతీ తెలుగు సినిమాలోనూ హీరోయిన్ పెళ్లిపీటలమీదుంటే.. హీరో వచ్చి భారీ డైలాగ్స్ చెప్పి ఆమె మెళ్లో తాళికట్టేస్తాడు. ఆ సమయంలో పెళ్ళిపీటల మీదున్న పెళ్ళి కొడుకు పరిస్థితి ఏంటనేది ఈ సినిమా కథాంశం. అలాంటి ఓ పెళ్లికొడుకు .. ఫ్రస్టేషన్ తో ఏం చేశాడు అనేది ప్రేమ్ కుమార్ ప్రధాన అంశం. ఇప్పటికే 80 శాతం షూటింగ్ కంప్లీట్ అవగా.. లాక్ డౌన్ అనంతరం మిగతా భాగం షూటింగ్ ప్రారంభమవుతుంది. మరి సంతోష్ శోభన్ కు ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ నిస్తుందో చూడాలి.
Must Read ;- ఆరుబైట ఆకాశం కింద పిల్లలతో ఎంజాయ్ చేస్తున్న బన్నీ