TDP Leaders Fires On YCP Government :
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ను టార్గెట్ గా చేసుకుని వైసీపీ కార్యకర్తలు చేసిన దాడి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. అక్రమంగా మైనింగ్ జరుగుతుందని, జరుగుతున్న వ్యవహారాలను పరిశీలించడానికి వెళ్లగా, అక్కడ వైసీపీ కార్యకర్తలు ఆయన పై దాడికి దిగారు. అక్రమ కేసులు పెట్టి.. అరెస్టు చేయడంతో టీడీపీ నాయకులంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మెతక వైఖరి వీడాలని, వైసీపీ ప్రభుత్వానికి వడ్డీతో సహా చెల్లించాల్సిందేనని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
దాడి పిరికిపంద చర్య : చంద్రబాబునాయుడు
దేవినేని ఉమపై వైసీపీ నేతల దాడి, పోలీసుల తీరుపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మండిపడ్డారు. అవినీతి,అక్రమాలను అడ్డుకుంటే దాడులకు పాల్పడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవినేనిపై వైసీపీ గూండాలదాడి పిరికిపంద చర్య అని అన్నారు. వైసీపీ నేతల అవినీతి, అక్రమాలను అడ్డుకుంటే దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. అవినీతి,అక్రమాలను అడ్డుకుంటే దాడులకు పాల్పడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కరిపై వంద మంది వైసీపీ గూండాల దాడి పిరికిపింద చర్య అన్నారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు : నారా లోకేశ్
టీడీపీ నేత దేవినేని ఉమపై సీఎం జగన్ రాజారెడ్డి రాజ్యాంగాన్ని ప్రయోగించారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దాడికి పాల్పడ్డవారిని అరెస్ట్ చేయాల్సిన పోలీసులు… బాధితులను నిందితుల్ని చేసి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి పోలీస్ వ్యవస్థ రాష్ట్రంలో ఉండడం దురదృష్టమన్నారు. మాజీమంత్రి పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితేంటని ప్రశ్నించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అన్యాయంగా వ్యవహరిస్తున్నారని లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
దారి మళ్లించి దాడి చేశారు : ధూళిపాళ్ల
పోలీసులే పక్కా ప్లాన్ తో దాడి చేయించారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. ముందస్తు సమాచారం ప్రకారమే, దాడి జరిగిన వైపు పోలీసులు కావాలనే దేవినేనిని దారి మళ్లించారని అన్నారు. దాడి జరుగుతుందని గ్రహించక పోలీసులు చెప్పిన దారిలోనే దేవినేని వెళ్లారన్నారు. బాధితుడైన దేవినేనిని కేసు పెట్టనివ్వకుండా, రివర్స్ లో ఆయనపైనే కేసు ఎలా పెడతారని పోలీసులపై ఆయన మండిపడ్డారు.
టీడీపీపైన కేసులా..? : ఎమ్మెల్సీ అశోక్ బాబు
దేవినేనిపై దాడి చేసినవారిని వదిలేసి.. టీడీపీ కార్యకర్తలపైనే తప్పుడు కేసులు పెడతారా? టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ప్రశ్నించారు. ఎమ్మెల్యే అనుచరులే ఉమపై దాడి చేశారని, అందుకు పోలీసులు సహకరించారని ఆరోపించారు. ఉమాపై ఎమ్మెల్యే దగ్గరుండి మరీ దాడి చేయించారని అశోక్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Must Read ;- జగన్‌రెడ్డి ఫ్యాక్షన్ పాలనలో దళితులకు బతికే హక్కులేదా?