మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచి ఎన్నికల వేడి మొదలవ్వడం తెలిసిందే. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమలతో పాటు సీనియర్ నటుడు సివిఎల్ నరసింహారావు కూడా పోటీ చేస్తున్నారు. అయితే.. సివిఎల్ నరసింహారావుకు లేడీ అమితాబ్ విజయశాంతి మద్దతు ఇస్తుండడంతో మా ఎన్నికలు మరింత ఆసక్తిగా మారాయి. తెలంగాణవారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ వారికి అంటే.. తెలుగు వారికి తెలుగు సినిమాల్లో అన్యాయం జరుగుతుందని.. తెలుగు వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తానంటూ సివిఎల్ నరసింహారావు పోటీలో దిగుతున్నట్టు తెలియచేశారు.
ఇదిలా ఉంటే.. సివిఎల్ నరసింహారావు ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్ వ్యూలో సినిమా ఇండస్ట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీని మార్చేంత శక్తి నాకు లేదు. సినిమా ఇండస్ట్రీలో అందరూ కాదు కానీ.. కొందరు భూకబ్జాదారులు ఉన్నారు. క్రిమినల్స్ ఉన్నారు. డ్రగ్స్ తీసుకునేవాళ్లు.. డ్రగ్స్ అమ్మేవాళ్లు ఉన్నారు. ఇలాంటి వారికి తెలంగాణలో స్ధానం లేదు. కేసీఆర్ గారు సాహితి ప్రియుడు. నీళ్లు, నియామకం, నిధుల్లో పడి టైమ్ లేదేమో కానీ.. ఆయన దృష్టికి కనుక వెళితే.. ఇండస్ట్రీలో సమస్యలను 5 నిమిసాల్లో ప్రాబ్లమ్ పరిష్కరిస్తారు.
కేటీఆర్ గారు, తుమ్మల నాగేవ్వరరావు గారు మరో ఇద్దరితో కలిపి సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ సబ్ కమిటీ తలుచుకుంటే అరగంటలో ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అన్ని సమస్యలు సమిసి పోయి రెండు రాష్ట్రాల్లో ఉన్న రెండు ఆర్గనైజేషన్స్ లో ఏకగ్రీవంగా ఎన్నుకుంటే బాగుంటుంది. నాకు సమస్యలు ఉన్నాయని చెప్పుకోలేని పరిస్థితుల్లో చాలా మంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు. మా సంస్థ కోసం బిల్డింగ్ కడతాం అంటున్నారు. బిల్డింగ్ వద్దు.. ముందు బాధల్లో ఉన్నవాళ్ల ఆకలి తీర్చండి. మమ్మల్ని ఆదుకోండి అని అప్లికేషన్ పెట్టుకున్నవాళ్లు చాలా మంది ఉన్నారు. అందుచేత ముందు వాళ్లని ఆదుకోండి. అని సీనియర్ నటుడు సివిఎల్ నరసింహారావు అన్నారు.
Must Read ;- మా ఎన్నికల బరిలో హేమ రూటే సపరేటా?