సమంత, నాగచైతన్య విడిపోతే మరో హీరో సిద్ధార్థ్ కు ఏమిటి సంబంధం? అదేమిటో తెలియనివారు కాదు నెటిజన్లు. చైతుతో ప్రేమకు ముందే హీరో సిద్ధార్థ్ తో సమంత ప్రేమాయణం నడిపిందన్నవిషయం జనం దృష్టిలో ఉంది. వారిద్దరికీ బ్రేకప్ జరిగిన తర్వాత చైతూకి ఆమె దగ్గరైంది. అలా అక్కినేని వారింట కోడలైంది. వీరి దాంపత్య బంధం మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. ఈ వ్యవహారం బయటికి వచ్చినప్పటి నుంచి నెటిజన్ల శోధన అంతా డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్, సామ్ మాజీ ప్రియుడు సిద్ధార్థ్ ల సోషల్ మీడియా ఖాతాల పైనే ఉంది.
అలా ఇంకెవరెవరు దీనిపై కామెంట్లు చేసినా నెట్ లో వైరల్ అవుతున్నాయి. సిద్ధార్థ్ తాజాగా చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. స్కూల్లో తన టీచర్ చెప్పిన తొలి పాఠం ఏమిటో అతను తన ట్వీట్ ద్వారా చెప్పారు. ‘మోసగాళ్లు ఎప్పటికీ బాగుపడరు’ అనే ఆ పాఠం సారాంశం. ఇది కేవలం సమంతను ఉద్ధేశించి చేసిన ట్వీట్ గా నెటిజన్లు భావిస్తున్నారు. అయితే సిద్ధార్థ అభిప్రాయం తప్పుగా ఓ నెటిజన్ కామెంట్ చేశారు. దీనివల్ల ఆమె రూ. 200 కోట్లు సంపాదించుకుంది. మీకన్నా ఆ డబ్బే విలువైందంటూ కామెంట్ చేశారు.
సిద్ధార్థ్ ట్వీట్ కు చాలామంది నెటిజన్లు స్పందించారు. ‘భార్యాభర్తల మధ్య ఏం జరిగిందనేది వాళ్లిద్దరికీ తప్ప ఇంకెవరికీ తెలియదు. వారు విడిపోవడానికి కారణాలు ఎవరికీ తెలియదు. వాళ్ల ప్రైవసీకి భంగం కలిగించవద్దు. దీన్నుంచి నుంచి బయటపడటానికి వారికి కాస్త సమయం ఇవ్వండి. అనవరసరమైన ఊహాగానాలు, వదంతుల జోలికి వెళ్లవద్దు’ అంటూ నటి ఖుష్బూ వ్యాఖ్యానించారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా నర్మగర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేసింది. విడాకులు ఎప్పుడు తీసుకున్నా తప్పు మగాళ్లదేనని అంది.
చాలామంది మహిళలు, పిల్లల జీవితాలను నాశనం చేసిన బాలీవుడ్ డైవోర్స్ ఎక్సపర్ట్ హీరో ఈ దక్షిణాది హీరోను కలిసిన తర్వాతే ఇలాంటి పరిణామాలు సంభవించాయని కంగన పేర్కొంది. అది అమీర్ ఖాన్ ఉద్దేశించి చేసినవిగా అందరూ భావిస్తున్నారు. విడాకుల తర్వాత కూడా సంగీత్ వేడుకలు జరపుకోవాలంటూ ఆర్జీవీ తనదైన బాణీలో ట్వీట్లు గుప్పించారు. నాగచైతన్య, సమంతల పేర్లు లేకుండానే ఇలాంటి ట్వీట్లు చేయడం గమనార్హం.
Must Read ;- అటు డ్రగ్స్.. ఇటు సెక్స్.. ఇదీ సినిమా సెన్సెక్స్!











